India Elections 2024: దేశ వ్యాప్తంగా ముగిసిన ఏడోదశ పోలింగ్

Lok Sabha Election 2024 Phase 7 Voting Ends
x

India Elections 2024: దేశ వ్యాప్తంగా ముగిసిన ఏడోదశ పోలింగ్

Highlights

Lok Sabha Election 2024: దేశ వ్యాప్తంగా ఏడోదశ పోలింగ్ ముగిసింది. తుది దశలో 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ పూర్తయింది.

Lok Sabha Election 2024: దేశ వ్యాప్తంగా ఏడోదశ పోలింగ్ ముగిసింది. తుది దశలో 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ పూర్తయింది. ఇవాళ జరిగిన ఏడోదశతో అన్ని స్థానాలకు పోలింగ్‌ కంప్లీట్ అయింది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. పోలింగ్ ప్రక్రియ పూర్తికావడంతో జూన్ 4 విడుదలైయ్యే ఫలితాల వెల్లడి కోసం ఈసీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫలితాల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంటడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

మార్చి 16న భారత్‌లో సార్వత్రిక ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుల చేసింది. ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించాలని షెడ్యూల్‌లో భాగంగా ఈసీ పేర్కొంది. మొత్తం 543 లోక్ సభ స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికలను నిర్వహించింది ఈసీ. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగగా.. జూన్ 1న చివరి దశ పోలింగ్ జరిగింది. కేవలం లోక్ సభ ఎన్నికలు మాత్రమే కాకుండా... ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సైతం ఈసీ నిర్వహించింది. వీటితోపాటు వివిధ రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలను నిర్వహించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories