దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్ పొడిగింపు

దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్ పొడిగింపు
x
Highlights

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ ను పొడగించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రీన్‌...

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ ను పొడగించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రీన్‌ జోన్లు, ఆరంజ్‌ జోన్లలో భారీగా ఆంక్షలను సడలించింది. గ్రీన్‌ జోన్లలో మద్యం విక్రయాలకు కూడా కేంద్రం అనుమతినిచ్చింది.

దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కట్టడి కాని పక్షంలో లాక్ డౌన్ ను పొడగించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 17వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరెంజ్, గ్రీన్ జోన్లకు కొన్ని సడలింపు ఇస్తూ లాక్ డౌన్ ను కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. గ్రీన్‌ జోన్లలో కొన్ని షరతులతో మద్యం విక్రయాలకు కూడా అనుమతినిచ్చింది. మద్యం షాపులలో ఐదుగురికి మించకుండా ఉండాలని స్పష్టం చేసింది. ఐదుగురు కూడా ఒక్కొక్కరి మధ్య రెండు గజాల దూరం పాటించాలని ఆదేశించింది.

ఆరంజ్‌ జోన్లలో టాక్సీలకు, క్యాబ్‌లు నడిపేందుకు కొన్ని షరతులతో కేంద్రం అనుమతి ఇచ్చింది. ఒక డ్రైవర్‌, ఒక పాసింజర్‌తో మాత్రమే టాక్సీలు, క్యాబ్‌లు నడవాలని స్పష్టం చేసింది. ఫోర్‌ వీలర్లలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతి నిచ్చింది. దీంతో పాటు గ్రీన్‌జోన్లలో బస్సులు తిరిగేందుకు కూడా కేంద్రం అనుమతినిచ్చింది. బస్సుల్లో 50 శాతం కెపాసిటీకి తగ్గట్లు మాత్రమే ప్రయాణికులను అనుమతించాలని బస్సుడిపోలలో కూడా 50 శాతం సిబ్బందితోనే కార్యక్రమాలు కొనసాగించాలని కేంద్రం ఆదేశించింది.

విమాన, రైలు, మెట్రో ప్రయాణాలపై, రోడ్డు మార్గంలో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. విద్యాసంస్థలు, హాస్పిటాలిటీ సర్వీసులపై, సామూహిక కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుందని మరోసారి తేల్చిచెప్పింది. సినిమా హాల్స్, మాల్స్, జిమ్స్, క్రీడా సముదాయాలు మూసే ఉంటాయని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే విమానాలు, రైళ్ల ద్వారా, రోడ్డు మార్గాల్లో ప్రయాణించడానికి అనుమతి లభిస్తుందని కేంద్రం తెలిపింది. ఇది అన్ని జోన్లకూ వర్తిస్తుందని ఉత్తర్వులో పేర్కొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories