Karnataka: రెండు వారాలు లాక్ డౌన్ పొడిగింపు

Karnataka Lockdown Extends Two Weeks
x

యెడియూరప్ప

Highlights

Karnataka: దేశంలో కరోనా సెకండ్ వేవ్ క‌ల్లోకం సృష్టిస్తుంది.

Karnataka: దేశంలో కరోనా సెకండ్ వేవ్ క‌ల్లోకం సృష్టిస్తుంది. క‌రోనా క‌ట్టడి చేసేందుకు ప‌లు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. మ‌రోవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కూడా వేగ‌వంతం చేస్తున్నాయి ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు. ఈ నేప‌థ్యంలో లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించాలని సీఎం యెడియూరప్ప నిర్ణయించారు. జూన్ 7 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి.

మ‌రో వైపు లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఘించిన వారిని ఉపేక్షించవద్దని పోలీసులకు అధికారులకు స్పష్టం చేశామని, ఆ మేరకు అనుమతి ఇచ్చామని వెల్లడించారు. నిత్యావసర వస్తువులు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్యలో కొనుగోలు చేయాలని సీఎం సూచించారు. కర్ణాటకలో మే 10 నుంచి 24వ తేదీ వరకు తొలుత లాక్ డౌన్ ప్రకటించినా, కేసుల ఉద్ధృతితో పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు.

కర్ణాటకలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 32 వేలకు పైగా కొత్త కేసులు వెల్లడి కాగా, 353 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories