ఇష్టమైతేనే బడికి.. లేకుంటే ఇంట్లోనే

ఇష్టమైతేనే బడికి.. లేకుంటే ఇంట్లోనే
x
Highlights

ఇష్టమైతేనే బడికి.. లేకుంటే ఇంట్లోనే ఇష్టమైతేనే బడికి.. లేకుంటే ఇంట్లోనే ఇష్టమైతేనే బడికి.. లేకుంటే ఇంట్లోనే ఇష్టమైతేనే బడికి.. లేకుంటే ఇంట్లోనే

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కోనసాగుతూనే ఉంది. అయితే మరణాల రేటు తక్కువగా ఉండటం, రికవరీ రేటు ఎక్కువగా ఉండటంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సడలింపులు ఇస్తుందో కేంద్ర ప్రభుత్వం. అన్‌లాక్‌ 4.0లో భాగంగా ఈ నెల 21 నుంచి 9 నుంచి 12 తరగతుల వరకు క్లాసుల నిర్వహించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో క్లాసుల నిర్వహణకు కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.

*మార్గదర్శకాల్లో ప్రధానమైన కీలకమైనది.. విద్యార్థులకు వారికి ఇష్టమైతేనే బడికెళ్లొచ్చు.. లేదంటే ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌ క్లాసులు వినొచ్చనే ఆప్షన్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించి తల్లిదండ్రులు/సంరక్షకుల నుంచి రాతపూర్వక లేఖను విద్యార్థులు సమర్పించాల్సి ఉంటుంది.

కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.

*కంటైన్మెంట్‌ జోన్లు లేని స్కూళ్లను మాత్రమే తెరువాలి.

*ప్రతిరోజు తరగతి గదితోపాటు బాత్రూంలు, ఆట స్థలాలు విధిగా శానిటైజ్‌ చేయించాలి.

*ఒకవేళ ఆ స్కూల్‌ను క్వారంటైన్‌ సెంటర్‌గా వాడినట్టయితే దానిని వందశాతం శానిటైజ్‌ చేయాలి.

*చేతులు శుభ్రం చేసుకోవడానికి విద్యార్థులకు సబ్బులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి.

*స్టాఫ్‌గది, కార్యాలయం, మెస్‌, గ్రంథాలయం, కేఫటేరియాల్లో ఖచ్చితంగా భౌతికదూరం పాటించాలి.

*విద్యార్థి,టీచర్‌ మధ్య ఇంటరాక్షన్‌ ఆరుబయట,లేదంటే చెట్లకింద ఏర్పాట్లు చేయాలి.

*తరగతి గది ఉష్ణోగ్రతలు 24 -30 సెల్సియస్‌ డిగ్రీలుగా, తేమ 40 -70 శాతంగా ఉండాలి.

*తరగతి గదుల్లో గాలి పీల్చుకునేందుకు వీలుగా కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి.

*నోటుపుస్తకాలు, పెన్నులు,పెన్సిళ్లు, వాటర్‌బాటిళ్లను ఒకరినొకరు మార్చుకోకూడదు.

*ప్రయోగశాలలను సెషన్లుగా విభజించి తక్కువ మంది విద్యార్థులను తీసుకెళ్లాలి.

*ప్రయోగశాలల్లోని పరికరాలను వాడకముందు, వాడిన తర్వాత ఎప్పటికప్పుడు శానిటైజ్‌చేయాలి.

ఇతర జాగ్రత్తలు

*బస్సుల్లో విద్యార్థులను పాఠశాలలకు లేదంటే వారి ఇళ్లకు తరలించేటప్పుడు భౌతికదూరం పాటించాలి

*తరగతులు, ప్రయోగశాలల్లో విద్యార్థులు తిరిగే లేదా తాకే ప్రాంతాలన్నింటిని ఉదయం , సాయంత్రం శానిటైజేషన్‌ చేయాలి.

*కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లను క్రిమికీటకనాశనం చేయాలి.

*తాగునీరు, హ్యాండ్‌వాష్‌స్టేషన్లు, మూత్రశాలలు, మరుగుదొడ్లును పరిశుభ్రంగా ఉంచాలి.

*సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు వాడిన మాస్క్‌లను ఎక్కడపడితే అక్కడ వెయ్యకుండా.. వాటికోసం ప్రత్యేక డస్ట్ బిన్ లు ఏర్పాటు చెయ్యాలి.

*విద్యార్థుల చేత ఎట్టి పరిస్థితుల్లో శానిటైజ్ పనులు‌ చేయించకూడదు.

*పాఠశాల ప్రాంగణంలో, ఆరుబయట, రోడ్లమీద గుమిగూడొద్దు.. విద్యార్థులు ఇలా ఉండకుండా ప్రత్యేకంగా ఒకరిని నియమించాలి.

*ఒకవేళ విద్యార్థులు, ఉపాధ్యాయులు అనారోగ్యానికి గురైతే వారిని పాఠశాలకు రావొద్దని ఆదేశించాలి.

*టీచర్లు,స్కూల్‌ కౌన్సిలర్లు,స్కూల్‌ హెల్త్‌వర్కర్లు విద్యార్థుల్లో మానసిక స్థైర్యం, ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయాలి.

*విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఒకవేళ కరోనా పాజిటివ్ గనక ‌వస్తే వెంటనే వారు తిరిగిన ప్రదేశాలను శానిటైజేషన్‌ చేయాలి.

పాఠశాలలు తెరిచిన తర్వాత..

*విద్యార్థులు, టీచర్లకు మధ్య కనీసం 6 ఫీట్ల భౌతికదూరం ఉండేట్లు చూసుకోవాలి. అందరికీ ఫేస్‌షీట్స్‌, మాస్క్‌లు ఉండేటట్లు చూసుకోవాలి.

*ఆల్కహాల్‌ బేస్డ్‌ శానిటైజర్‌తో తరచూ చేతులు కడుక్కోవాలి. తుమ్మినా, దగ్గినా మోచేతిని, చేతిరుమాలును అడ్డుపెట్టుకోవాలి.

*పాఠశాల ప్రాంగణంలో ఉమ్మివేయకుండా చూడాలి.

*తక్కువ మంది విద్యార్థులతోనే ఈవెంట్స్‌ను నిర్వహించాలి.

*హైరిస్క్‌ ఉన్నవారు.. అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.

*కరోనాపై ఉద్యోగులు, విద్యార్థుల్లో అవగాహన పెంచాలి.. అందుకోసం ఆరోగ్యసేతు యాప్ ను కూడా డౌన్ లోడ్ చేసుకోవాలి.

అందుబాటులో ఉంచాల్సినవి

*ఫేస్‌కవర్లు, మాస్కులు, పర్సనల్‌ ప్రొటెక్షన్‌ కిట్లు, హ్యాండ్‌ శానిటైజర్లను పెద్దఎత్తున నిల్వ ఉంచుకోవాలి.

*ఆల్కహాల్‌వైపర్లు, సబ్బులు, పల్స్‌ ఆక్సీమీటర్లు, థర్మల్‌గన్స్‌ ఐఈసీలను కూడా అంబాటులో ఉంచుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories