రైతులు ఢిల్లీ విడిచి వెళ్లిపోవాలంటూ స్థానికుల నినాదాలు

రైతులు ఢిల్లీ విడిచి వెళ్లిపోవాలంటూ స్థానికుల నినాదాలు
x

రైతులు ఢిల్లీ విడిచి వెళ్లిపోవాలంటూ స్థానికుల నినాదాలు

Highlights

*కిసాన్‌ పరేడ్‌ తర్వాత ఢిల్లీలో సద్దుమణగని పరిస్థితి *ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల నిరసనలు *అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత

రిపబ్లిక్‌డే రోజున ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకం కావడం పోలీసులపై దాడులు జరగడంతో కేంద్రం సీరియస్‌గా ఉంది. ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు డిసైడ్‌ అయ్యింది. అటు కిసాన్ పరేడ్‌లో జరిగిన విధ్వంస ఘటనపై స్థానికులు ఆందోళన బాట పట్టారు.

ఢిల్లీలో కిసాన్‌ పరేడ్‌ ఘటన తర్వాత కూడా పరిస్థితులు సద్ధుమణగడం లేదు. ఓవైపు బోర్డర్‌లో రైతు సంఘాలు నిరసనలు తెలుపు తుండగా మరోవైపు రైతులు ఢిల్లీ విడిచి వెళ్లిపోవాలంటూ స్థానికులు నినాదాలు చేస్తున్నారు. దీంతో మరోసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

ఇవాళ సింఘు బోర్డర్‌ దగ్గర రోడ్డెక్కిన స్థానికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు ప్రదర్శించి రైతులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖాళీ కరో సింఘు బోర్డర్‌ అంటూ ఆందోళన చేశారు. సరిహద్దుల్లో టెంట్లు ఎత్తేయాలని ఢిల్లీ దాటి వెళ్లేందుకు 72 గంటల గడువిస్తూ అల్టిమేటం జారీ చేశారు.

ఇదిలా ఉంటే.. ఎర్రకోట ఘటనను ఢిల్లీ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిరసన తెలుపుతున్న రైతు సంఘాలకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశం విడిచి వెళ్లకుండా వారి పాస్ పోర్టులు సరండర్ చేయాలని ఆదేశించారు. ట్రాక్టర్ ర్యాలీ ఎన్‌వోసీపై సంతకాలు చేసిన రైతు సంఘాల నాయకులు విచారణకు హాజరుకావాలన్నారు. ఇక ఈ వ్యవహరం మొత్తాన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు.. విధ్వంస ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపూ సిద్ధూ అజ్ఞతంలోకి వెళ్లాడు. దాడి జరిగిన అర్ధరాత్రి నుంచి కనిపించకుండా పోయాడు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో అతడిపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. చివరి లోకేషన్ హర్యానాలో ఉన్నట్టు గుర్తించగా అక్కడి నుంచి ఎక్కడకు వెళ్లాడనేది తెలియాల్సి ఉంది.

జస్టీస్‌ ఫర్‌ సిక్కు సంస్థ రైతుల ధర్నాకోసం విదేశాల నుంచి భారీ ఎత్తున నిధులు సేకరించినట్టు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. అటు ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగర్‌ దీపూ సిద్ధూ, ఆయన తమ్ముడు మణీదీప్‌కు కూడా ఎన్‌ఐఏ నోటీసులు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories