Loan Moratorium case: లోన్ మారటోరియంపై సుప్రీం విచార‌ణ‌ నేడే

Loan Moratorium case: లోన్ మారటోరియంపై సుప్రీం విచార‌ణ‌ నేడే
x

Loan Moratorium case: లోన్ మారటోరియంపై సుప్రీం విచార‌ణ‌ నేడే

Highlights

Loan Moratorium case: మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జ‌రుగునున్న‌ది. రుణగ్రహీతలకు ఊరటనిచ్చేలా కేంద్రం,ఆర్బీఐ ఇప్పటికే రెండు సార్లు సుప్రీంకోర్టు లో అఫిడవిట్ దాఖలు చేసింది.

Loan Moratorium case: మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జ‌రుగునున్న‌ది. రుణగ్రహీతలకు ఊరటనిచ్చేలా కేంద్రం,ఆర్బీఐ ఇప్పటికే రెండు సార్లు సుప్రీంకోర్టు లో అఫిడవిట్ దాఖలు చేసింది. కరోనాతో ఏర్పడిన సంక్షోభం కారణంగా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి ఊరట కలిగిస్తూ కేంద్రం లోన్ మారటోరియం విధించింది.

ఈ క్రమంలో వడ్డీపై వడ్డీ, మారటోరియం గడువు పొడిగింపు వంటి అంశాలపై సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వు బ్యాంకు(RBI) పలు విషయాలు తెలిపింది. రుణ గ్రహీతలకు కల్పించిన రుణ మారటోరియం పరిధిని మరోసారి పొడిగించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. మారటోరియం 6 నెలలకు మించి ఇవ్వడం సాధ్యం కాదని RBI దాఖలు చేసిన అవిడవిట్ లో తెలిపింది. ఈ కాలంలో రూ. 2 కోట్ల వరకు ఉన్న రుణాలపై వడ్డీని వదులుకునేందుకు సిద్ధమన్న కేంద్రం తెలిపింది. కరోనా కారణంగా నష్టపోయిన ఆయా రంగాలకు మరింత ఆర్థిక ఉపశమనాన్ని అందించలేమని తేల్చి చెప్పింది.

MSMEలు, విద్యా, గృహ, వినియోగదారు వస్తువులు, ఆటో రుణాలు సహా క్రెడిట్ కార్డ్ బకాయిలపై వడ్డీ మినహాయింపు చేస్తున్న‌మ‌ని, 2 కోట్ల వరకు ఉన్న రుణాల చక్రవడ్డీ మాఫీ ఒక్కటే చేయగలమని,మారటోరియం కాలం గడువు పొడిగించలేమని రెండో అఫిడవిట్లో కేంద్రం,ఆర్బీఐ కోర్టుకు తెలిపింది. కరోనాతో ఆదాయం తగ్గిన వివిధ రంగాల వారికి మారటోరియంతో ఊరట కల్పించామని, రుణగ్రహీతలకు చక్రవడ్డీ మాఫీ చేశామని, ఇంతకంటే ఎక్కువ ఉపశమనాలు ఇవ్వలేమని కేంద్రప్రభుత్వం అఫిడవిట్లో స్పష్టం చేసింది. ఆర్థిక విధానాలు ప్రభుత్వానికి చెందినవని, ఇందులో కోర్టుల జోక్యం తగదని కేంద్రం కోర్టుకు తెలిపింది.

చక్రవడ్డీ మాఫీ చేయడం కాకుండా ఇంకే ఇతర ఉపశమనాలు కల్పించలేమని.. అలా చేస్తే ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌ రంగం ప్రమాదంలో పడుతుందని కేంద్రం పేర్కొన్నది. రంగాలవారీగా ఉపశమనం కల్పించడం కుదరదని, కామత్‌ కమిటీ నివేదిక కూడా ఇదే చెబుతోందని కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు రుణాలపై మారటోరియం గడువును మరింతకాలం పెంచలేమని ఆర్‌బీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. మారటోరియం కాలాన్ని పొడిగిస్తే అది వాయిదాల చెల్లింపులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందన్న రిజర్వ్‌ బ్యాంక్ పేర్కోంది. మారటోరియం కాలం పొడిగింపు వల్ల రుణగ్రహీతలపై భారం పెరుగుతుందని ఆర్బీఐ పేర్కొన్న‌ది. కేంద్రం,ఆర్బీఐ దాఖలు చేసిన అఫిడవిట్ల పై నేడు విచారణ కొనసాగనున్నది.

Show Full Article
Print Article
Next Story
More Stories