ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు పద్మవిభూషణ్ పురస్కారం!

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు పద్మవిభూషణ్ పురస్కారం!
x
Highlights

దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకీ కేంద్రం పద్మవిభూషణ్ అవార్డుతో గౌరవించింది.

దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంనకు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించింది. ప్రతి ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా వివిధ రంగాల్లో ప్రముఖులకు ప్రకటించే పద్మ అవార్డుల్లో భాగంగా ఈ సంవత్సరం స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్నీ పద్మవిభూషణ్ పురస్కారంతొ గౌరవిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

కాగా, ఇటీవల కరోనా కోరల్లో చిక్కుకుని బాల సుబ్రహ్మణ్యం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. బాలూకు పద్మవిభూషణ్ పురస్కారం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్రం పద్మా పురస్కారాలను ప్రకటించింది. కళలు, సామాజిక సేవ వైద్యం, సైన్స్, ఇంజనీరింగ్ తదితర రంగాల్లో ప్రముఖులకు ఇచ్చే అవార్డులను ఈసారి 119 మందికి ప్రకటించారు.. వీరిలో 7 గురికి పద్మవిభూషణ్,10మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు.

పురస్కార గ్రహీతల్లో 29 మంది మహిళలున్నారు. ఎన్నారై కోటాలో మరో 10 మందికి పురస్కారాలు ప్రకటించగా, 16 మందికి మరణానంతర పురస్కారాలు దక్కాయి.. ఒక ట్రాన్స్ జెండర్ కు కూడా పద్మాపురస్కారం దక్కింది. గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం కి పద్మ విభూషణ్ ప్రకటించారు. తరుణ్ గొగోయ్, రాం విలాస్ పాశ్వాన్,గుజరాత్ బీజేపీనేత కేశూభాయ్ పటేల్, స్పీకర్ సుమిత్రా మహాజన్ లకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్ కు చెందిన రామస్వామి అన్నవరపు, నిడుమోలు సుమతి, తెలంగాణకు చెందిన కనకరాజు లకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories