Bharat Ratna: బిహార్‌ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న

Late Former Bihar CM Karpoori Thakur To Be Awarded Bharat Ratna
x

Bharat Ratna: బిహార్‌ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న

Highlights

Bharat Ratna: నానాజీ దేశ్‌ముఖ్‌లకు అత్యున్నత పౌర పురస్కారం

Bharat Ratna: పదేళ్లుగా ప్రధాన మంత్రిగా కొనసాగుతున్న నరేంద్ర మోడీ హయాంలో ఆరుగురికి భారతరత్న అవార్డులు దక్కాయి. 2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2015లో మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు మదన్‌ మోహన్‌ మాలవీయలకు ఈ అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించారు. 2019లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రముఖ అస్సామీ సంగీతకారుడు భూపేన్‌ హజారికా, ప్రముఖ సామాజిక సేవకుడు నానాజీ దేశ్‌ముఖ్‌లకు భారతరత్న ఇచ్చారు. మొత్తం పదేళ్లలో రెండేసార్లు ఈ పురస్కారాన్ని ప్రకటించినప్పటికీ ఒకసారి ఇద్దరు, మరోసారి ముగ్గురికి కలిపి ఐదుగురు ప్రముఖులను గౌరవించారు. 2019 తర్వాత ఈ అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించడం ఇదే తొలిసారి. కర్పూరీ ఠాకుర్‌ కంటే ముందు 48 మందికి ఈ గౌరవం దక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories