Bipin Rawat: ఆ ఐదు నిమిషాల్లోనే అంతా జరిగిపోయిందా?

Last 5 Minutes of Bipin Rawat Chopper Crash
x

Bipin Rawat: ఆ ఐదు నిమిషాల్లోనే అంతా జరిగిపోయిందా?

Highlights

Bipin Rawat: ఐదు నిమిషాలు...ఐదే ఐదు నిమిషాలు. జస్ట్ ఫైవ్ మినిట్స్. కేవలం మూడొందల సెకండ్లు.

Bipin Rawat: ఐదు నిమిషాలు...ఐదే ఐదు నిమిషాలు. జస్ట్ ఫైవ్ మినిట్స్. కేవలం మూడొందల సెకండ్లు. అంతా ఆ ఐదు నిమిషాల్లోనే ఘోరం జరిగిపోయింది. ఇంతకీ ఆ ఫైవ్ మినిట్స్‌లో ఏం జరిగింది? సూలూరు టు వెల్లింగ్టన్‌ మధ్యలో ఎలాంటి పరిణామాలు సంభవించాయి?

త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్‌ రావత్‌, చిట్టచివరగా పాల్గొన్న కార్యక్రమం ఇది. మంగళవారం అంటే డిసెంబర్‌ 7, 2021, న్యూఢిల్లీలో జరిగిన ప్యానెక్స్‌ కర్టెన్‌ రైజర్‌ మీటింగ్‌లో పాల్గొన్న గ్రూప్ ఫోటో ఇది. ఈ కార్యక్రమం అయిపోగానే, ఢిల్లీ నుంచి తమిళనాడులోని వెల్లింగ్టన్‌లో ఉన్న డిఫెన్స్‌ సర్వీస్‌ స్టాఫ్‌ కాలేజీలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. దీంతో భార్యతో పాటు కలిసి ఆయన తమిళనాడుకు వెళ్లారు. మరి తర్వాత ఏం జరిగింది?

ఉదయం 11.48 నిమిషాలు.. సూలూరు ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి టేకాఫ్

సూలూరు ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి, వెల్లింగ్టన్‌లో డిఫెన్స్‌ స్టాప్‌ కాలేజీకి బయల్దేరారు బిపిన్‌ రావత్ బృందం. అత్యాధునిక భద్రతా ప్రమాణాలున్నా MI 17V5 చాపర్‌లో, తన భార్య మధులికతో కలిసి మరో పన్నెండు మంది ఆర్మీ అధికారులతో ఆయన వెల్లింగ్టన్‌కి బయలు దేరారు. నీలగిరి కొండల గుండా ప్రయాణించి, ఈ హెలికాప్టర్‌ వెల్లింగ్టన్‌ రీచ్‌ కావాల్సి వుంది. సూలూరు నుంచి వెల్లింగ్టన్‌ల మధ్య దూరం 94 కిలోమీటర్లు.

మధ్యాహ్నం 12.22 నిమిషాలు.. రావత్‌ చాపర్‌ మిస్సింగ్

సూలూరు నుంచి బయల్దేరిన హెలికాప్టర్ నీలగిరి కొండల్లో ప్రయాణిస్తున్న సమయం. బయల్దేరిన తర్వాత, దాదాపు గమ్యస్థానం దరిదాపులకు చేరే వరకు ప్రయాణం సజావుగానే సాగింది. దాదాపు 30 నిమిషాల తర్వాత, హెలికాప్టర్ రూట్‌లో ప్రాబ్లమ్స్ వచ్చాయట. బేస్‌స్టేషన్‌తో కమ్యూనికేషన్‌ కట్‌ అయ్యింది. చివరగా మధ్యాహ్నం 12.22 గంటల సమయంలో బేస్‌ స్టేషన్‌తో సంబంధాలు పూర్తిగా కట్‌ అయ్యాయి. స్థానికుల కథన ప్రకారం, మధ్యాహ్నం 12:27 గంటల సమయంలో హెలికాప్టర్‌ క్రాష్‌ అయ్యింది.

అంతా ఆ ఐదు నిమిషాల్లోనే జరిగిపోయిందా?

మధ్యాహ్నం 12.22 గంటలకు చాపర్‌లో ప్రాబ్లమ్‌ గుర్తించారు. 12.27 గంటలకు బేస్‌ స్టేషన్‌తో కమ్యూనికేషన్‌ కట్‌ అయ్యింది. అంటే 12.22 నుంచి 12.27 మధ్యలోనే అంతా జరిగిపోయింది. ఐదు నిమిషాల వ్యవధిలోనే హెలికాప్టర్‌ కూలిపోయింది.

గమ్యస్థానమైన వెల్లింగ్టన్‌‌కు దారిదాపుల్లో, అంటే కూనూరు అటవీ ప్రాంతం సమీపంలో యాక్సిడెంట్‌ అయ్యింది. ఇక్కడి నుంచి వెల్లింగ్టన్‌లో డిఫెన్స్‌ స్టాప్‌ కాలేజీకి కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరో పది నిమిషాలు ప్రయాణం చేస్తే చాలు, చాపర్ సేఫ్‌గా నేలకు దిగేది. కానీ ఆ గ్యాప్‌లోనే జరగరాని నష్టం జరిగిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories