TOP 6 News @ 6 PM: కేటీఆర్‌కు బిగ్ రిలీఫ్... తెలంగాణలో రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా ప్రక్రియ ఎక్కడి వరకొచ్చింది?

TOP 6 News @ 6 PM: కేటీఆర్‌కు బిగ్ రిలీఫ్... తెలంగాణలో రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా ప్రక్రియ ఎక్కడి వరకొచ్చింది?
x
Highlights

1) Formula E Race Case: తీర్పు వచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దు Telangana High Court: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్ ను...

1) Formula E Race Case: తీర్పు వచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దు

Telangana High Court: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు మంగళవారం సాయంత్రం కోర్టు తెలిపింది. ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ పిటిషన్ పై వాదనలు జరిగాయి. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సిద్దార్ద్ ధవే వాదించారు. ఈ నెల 19న కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది.

ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు తొలుత ఈ నెల 31 వరకు అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.డిసెంబర్ 31న నిర్వహించిన విచారణ నిర్వహించిన న్యాయస్థానం ఈ పిటిషన్ పై తీర్పు ఇచ్చేవరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2) Perni Nani: ఏపీ హైకోర్టులో పేర్నినానికి ఊరట

Perni Nani: పేర్ని నాని(Perni Nani)పై జనవరి 6వరకు తొందరపాటు చర్యలు వద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court) మంగళవారం ఆదేశించింది. తన భార్య పేరున ఉన్న గోడౌన్ లో రేషన్ బియ్యం మాయమైన ఘటనలో పేర్నినానిని ఏ6 గా చేర్చారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డిసెంబర్ 31న పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు సోమవారం వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది.

ఇదే కేసులో నాని భార్య జయసుధ (Perni Jayasudha)ఏ1గా ఉన్నారు. ఆమెకు డిసెంబర్ 30 కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 13న ఆమె ముందస్తు బెయిల్(Anticipatory Bail) పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ చేసిన కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. జయసుధకు చెందిన గోడౌన్ లో నిల్వ ఉంచి రేషన్ బియ్యంలో 378 మెట్రిక్ టన్నుల బియ్యం తక్కువగా ఉందని అధికారులు గుర్తించారు. ఈ బియ్యం షార్టేజీపై ఇప్పటికే రూ.1.68 కోట్లు ఫైన్ కట్టారు. ఇంకా రూ.1.67 కోట్లు కట్టాలని సివిల్ సప్లయిస్ అధికారులు నోటీసులు జారీ చేశారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3) Telangana Cabinet: జ‌న‌వ‌రి 4న కేబినెట్ భేటీలో రైతు భరోసా, రేషన్‌కార్డులపై చర్చ?

Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ సమావేశం జనవరి 4వ తేదీన సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో రైతు భరోసా, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయం, కొత్త రేషన్ కార్డులు, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు సహా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. దీంతో ఈ కేబినెట్ భేటీపై ఆయా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

సంక్రాంతి నుంచే రైతు భరోసా పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతు భరోసా ఎవరికి ఇవ్వాలన్న దానితో పాటు కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాల ఖరారుపై సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. వ్యవసాయ యాంత్రీకరణ, వీఆర్వో వ్యవస్థ, భూ భారతి అమలు వంటి అంశాలపై కూడా చర్చించనున్నట్టుగా సమాచారం. ఈ నెల 30న కేబినెట్ భేటీ జరగాల్సి ఉంది. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి సంతాప దినాల్లో భాగంగా నివాళులర్పించేందుకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. దీంతో కేబినెట్ భేటీ వాయిదా పడింది.

4) Prabhas: డ్రగ్స్‌ అవసరమా డార్లింగ్స్‌? న్యూఇయర్ వేళ ప్రభాస్ స్పెషల్ వీడియో..

Prabhas Drugs Awareness Video: న్యూ ఇయర్ వేళ డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ప్రభాస్ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. అందులో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. లైఫ్‌లో మనకు బోల్డన్ని ఎంజాయ్‌మెంట్స్ ఉన్నాయి. కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. అలాగే మనల్ని ప్రేమించే మనుషులు.. మన కోసం బతికే మనవాళ్లు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్టింగ్స్? అంటూ వీడియోలో సందేశం ఇచ్చారు.

జీవితాన్ని నాశనం చేసే మాదక ద్రవ్యాలకు నో చెప్పాలని పిలుపునిచ్చారు. మీకు తెలిసిన వాళ్లు ఎవరైన డ్రగ్స్‌కు బానిసలు అయితే టోల్‌ఫ్రీ నంబర్ 8712671111కు కాల్ చేయాలని సూచించారు. డ్రగ్స్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. బాధితులు కోలుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. రేపు జనవరి 1 కాబట్టి ఈ రోజు రాత్రి ఈవెంట్స్ ఉంటాయి. ఇలాంటి సమయంలో అవగాహన కల్పిస్తూ ప్రభాస్ వీడియో సందేశం విడుదల చేశారు.

5) Gold Rate: కొత్త ఏడాదిలో బంగారం కొనడం కష్టమేనా.? తులం ధర ఎంతకు చేరనుందో తెలుసా.?

Gold Price: మనదేశంలో పండగలు, శుభకార్యాలు, వివాహాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారం. బంగారం అంటే మగువలకు అంత ఇష్టం. అంతేకాదు పెట్టుబడి సాధనంగా కూడా బంగారాన్ని ఉపయోగిస్తుంటారు. పలు కారణాల వల్ల ఈ ఏడాది బంగారం ధర దూసుకెళ్లింది. ఇక వచ్చే ఏడాది ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. భౌగోళికంగా రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, ఆర్థిక అస్థిరత కొనసాగితే దేశీయంగా 10 గ్రాముల పసిడి ధర రూ. 85 వేలకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే రూ.90 వేలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) New Zealand welcomes 2025: అక్కడ అన్ని దేశాలకంటే ముందే న్యూ ఇయర్ వచ్చేసింది

New Zealand becomes first country in the world to welcome new year 2025: న్యూజిలాండ్‌లో అప్పుడే న్యూ ఇయర్ వచ్చేసింది. న్యూజిలాండ్‌లో డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గంటలయి కొత్త సంవత్సరంలోకి ప్రవేశించడంతో అక్కడి ప్రజలు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2025 కొత్త సంవత్సరంలోకి ప్రవేశించిన మొదటి దేశంగా న్యూజిలాండ్ నిలిచింది. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఉన్న స్కై టవర్ న్యూ ఇయర్ వేడుకలకు వేదికగా నిలిచింది.

ఆకాశాన్ని తాకినట్లుగా ఉండే స్కై టవర్ చుట్టూ మిరుమిట్లు గొలిపే తారాజువ్వల మధ్య చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు అన్నట్లుగా న్యూజిలాండ్ న్యూ ఇయర్ సంబరాలు కనిపించాయి. ఆ ఫైర్‌వర్క్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories