Top 6 News @ 6PM: కేటీఆర్‌పై కేసు నమోదు... కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారా?

Top 6 News @ 6PM: కేటీఆర్‌పై కేసు నమోదు... కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారా?
x
Highlights

1) Case Filed on KTR: కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు.. అసలు ఆరోపణలు ఏంటంటే... Telanana ACB filed case on KTR over alleged irreguarities in Formula E car...

1) Case Filed on KTR: కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు.. అసలు ఆరోపణలు ఏంటంటే...

Telanana ACB filed case on KTR over alleged irreguarities in Formula E car racing: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ-కారు రేసింగ్ వ్యవహారంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అర్వింద్ కుమార్, A3 గా HMDA చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అవినీతి నిరోధక చట్టం కింద 13(1)A, 13(2) అలాగే 409, 120 B సెక్షన్స్ కలిపి మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేటీఆర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2) హై కోర్టులో కేటీఆర్ టీమ్ - మీడియా ముందుకు కేటీఆర్

కేటీఆర్ పై తెలంగాణ ఏసీబీ కేసు మోదు చేసిన వెంటనే ఆయన టీమ్ హై కోర్టుకు చేరుకున్నట్లు వార్తలొస్తున్నాయి. కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు తరువాత ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో కుదిరితే అరెస్టును అడ్డుకునేందుకు స్టే తీసుకోవడం లేదా యాంటిసిపేటరీ బెయిల్ కు వెళ్లేలా కేటీఆర్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. హై కోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే ఆలోచలో కేటీఆర్ తరపు న్యాయవాదులు ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ కేసు విషయంలో స్పందించేందుకు ఇంకాసేపట్లోనే కేటీఆర్ మీడియా ముందుకు రానున్నారు.

3) Telangana SSC Board Exams Schedule: తెలంగాణ పదో తరగతి పరీక్షల టైమ్ టేబుల్ వచ్చేసింది

Telangana SSC board Exams schedule 2025: తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. 2025 మార్చి 21వ తేదీ నుండి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు మొదలవనున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలంగాణ ఎస్ఎస్‌సి బోర్డు తెలిపింది.

మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్, మార్చి 22న సెకండ్ లాంగ్వెజ్ పరీక్ష, మార్చి 24న ఇంగ్లీష్ ఎగ్జామ్, మార్చి 26న మ్యాథమెటిక్స్ (గణితం) పరీక్ష, మార్చి 28న ఫిజిక్స్ (భౌతిక శాస్త్రం) పరీక్ష, మార్చి 29న బయాలజీ (జీవశాస్త్రం) పరీక్ష, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ (సాంఘీక శాస్త్రం) పరీక్ష, ఏప్రిల్ 3న ఒకేషనల్ కోర్స్ మొదటి పేపర్, ఏప్రిల్ 4న ఒకేషనల్ కోర్స్ రెండో పేపర్ పరీక్ష జరగనుంది.

4) AP CM Chandrababu Naidu: ఏపీ రాజధాని నిర్మాణానికి 31 వేల కోట్లు

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ. 31 వేల కోట్లు సిద్ధంగా ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ నిధులతో అమరావతి నిర్మాణం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. రాజధానికి ఈ నిధులను వెచ్చించడంలో ఎలాంటి ఆర్థిక సమస్యలు అడ్డం రావని అభిప్రాయపడ్డారు. ఏపీ రాజధానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కేలా అమరావతిని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు నాయుడు తెలిపారు.

5) AP Cabinet Meeting Points: కీలక బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ కేబినెట్

గురువారం మధ్యాహ్నం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యమైన నిర్ణయాలు ఇలా ఉన్నాయి.

జల్ జీవన్ మిషన్ పనుల రద్దు చేయడంతో పాటు వాటిని మాడిఫై చేసి తిరిగి టెండర్లను ఆహ్వానించడం.

రాజధాని అమరావతి నిర్మాణంలో రూ. 8821 కోట్ల విలువైన పనులకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు.

అమరావతి నగరంలో 25 ఇంజినీరింగ్ పనుల కోసం రూ.24,316 కోట నిధులు మంజూరు చేయాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.

కొత్తగా ఏర్పాటైన 12 నగర పంచాయతీలను మున్సిపాలిటీలకు ట్రాన్స్‌ఫర్ చేసే ఫైలుకు కేబినెట్‌లో ఆమోదం.

రాజధాని అభివృద్ధి కోసం హడ్కో నుండి రూ.11,000 కోట్లు, కేఎఫ్‌డబ్ల్యు నుండి రూ.16,000 కోట్ల మొత్తం రుణం తీసుకునే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.

ఇవేకాకుండా పలు ఇతర కీలక బిల్లులు, ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

6) Parilament Ruckus over Amit Shah's comments on Ambedkar: పార్లమెంట్‌లో గందరగోళం.. గాయపడిన బీజేపీ ఎంపీ

పార్లమెంట్ ఆవరణంలో గందరగోళం నెలకొంది. డా.బిఆర్ అంబేద్కర్‌ను కేంద్ర హోమంత్రి అమిత్ షా (Amith shah) అవమానించారంటూ విపక్ష సభ్యులు నిరసన చేపట్టారు. అటు కాంగ్రెస్ తీరుకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నిరసనకు దిగారు. ఇరుపక్షాల నిరసనలతో పార్లమెంట్ ప్రాంగణం హోరెత్తింది. అంబేద్కర్‌ను (Ambedker) అవమానించారంటూ పరస్పర విమర్శలు చేసుకున్నారు. పార్లమెంట్ లోపలికి వెళ్తున్న అధికార పార్టీ ఎంపీలను విపక్ష సభ్యులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.

ఈ ఘటనలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ సింగ్ సారంగి ( BJP MP Pratap Chandra Sarangi ) గాయపడ్డారు. స్వల్పంగా గాయపడిన ఎంపీని ఆస్పత్రికి తరలించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నెట్టారంటూ అధికార పక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై రాహుల్ గాంధీ (Rahul ghandi)స్పందించారు. తమను అడ్డుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారని ఈ తోపులాటలో బీజేపీ ఎంపీ గాయపడ్డారని రాహుల్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories