Murder Attempt: కౌన్సిలర్‌పై తుపాకీతో హత్యాయత్నం.. షూటర్‌ను ఛేజ్ చేసి పట్టుకున్న కౌన్సిలర్

Murder Attempt: కౌన్సిలర్‌పై తుపాకీతో హత్యాయత్నం.. షూటర్‌ను ఛేజ్ చేసి పట్టుకున్న కౌన్సిలర్
x
Highlights

Councillor chases shooter after his Murder attempt goes wrong: కౌన్సిలర్‌ను చంపడానికి కాంట్రాక్ట్ తీసుకున్న ఇద్దరు కిల్లర్స్ తమకు ఇచ్చిన టార్గెట్...

Councillor chases shooter after his Murder attempt goes wrong: కౌన్సిలర్‌ను చంపడానికి కాంట్రాక్ట్ తీసుకున్న ఇద్దరు కిల్లర్స్ తమకు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయడానికి స్పాట్‌కు వచ్చారు. ఆ సమయంలో కౌన్సిలర్ ఇంటి ముందు గేటు బయట ఉన్నారు. మరొక మహిళ, మరో పురుషుడితో మాట్లాడుతూ కుర్చిలో కూర్చుని ఉన్నారు. వారి ఇల్లు కూడా చౌరస్తాలోనే ఉండటంతో అక్కడి నుండి వచ్చీపోయే వారికి వారు నేరుగానే కనిపిస్తున్నారు. ఆ సమయంలోనే ఈ ఇద్దరు కాంట్రాక్ట్స్ కిల్లర్స్ స్కూటీపై అక్కడికి వచ్చారు. వారిలో స్కూటీపై వెనుక కూర్చున్న వ్యక్తి వేగంగా స్కూటీ దిగి నేరుగా కౌన్సిలర్ ముందుకే వెళ్లి తుపాకీ ఎక్కుపెట్టారు. రెండు రౌండ్లు కాల్పులు జరిపేందుకు షూటర్ ప్రయత్నించాడు. అక్కడే కౌన్సిలర్ కిల్లింగ్ స్టోరీ మరో మలుపు తీసుకుంది. షూటర్ రెండుసార్లు కాల్చినప్పటికీ ఆ తుపాకీ పనిచేయలేదు.

తుపాకీ పనిచేయకపోవడంతో షూటర్ ఇక చేసేదేం లేక అక్కడి నుండి అంతే వేగంగా వెనుతిరిగి వెళ్లి స్కూటీ ఎక్కి పారిపోబోయారు. కానీ అప్పటికే ఆ దృశ్యాన్ని కళ్లారా చూసిన కౌన్సిలర్ వెంటనే తేరుకున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ షూటర్ వెనుకాల అంతే వేగంగా పరుగెత్తికెళ్లి పట్టుకోబోయారు. కౌన్సిలర్ వెంటపడి షర్ట్ కాలర్ పట్టుకోవడంతో ఆ షూటర్ స్కూటీ ఎక్కడంలో బ్యాలెన్స్ కోల్పోయారు.

అప్పటికే పట్టుబడతామనే భయంతో ఆ స్కూటీని నడిపిస్తున్న వ్యక్తి ఈ షూటర్ కోసం వెయిట్ చేయకుండా వేగంగా ముందుకు పోనిచ్చారు. అలా స్కూటీ వెనుకాల షూటర్ పరుగెడుతున్నారు. ఆ షూటర్ వెనుకాల కౌన్సిలర్ పరుగెడుతున్నారు. కౌన్సిలర్ వెనుకాల ఆయనకు సాయంగా షూటర్‌ను పట్టుకోవడానికి అనుచరులు పరుగెడుతున్నారు. కొద్దిదూరంపాటు నడిరోడ్డుపై ఈ ఛేజింగ్ సీన్ ఇలాగే కంటిన్యూ అయింది. మొత్తానికి కొద్ది దూరం పరుగెత్తిన తరువాత కౌన్సిలర్ ఆ షూటర్ ని పట్టుకున్నారు. ఈ మొత్తం దృశ్యాలు కౌన్సిలర్ ఇంటి ముందున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

షూటర్‌ను పట్టుకున్న కౌన్సిలర్, ఆయన అనుచరులు ఆయనపై దాడికి దిగారు. కౌన్సిలర్‌ను చంపడానికి ఎవరు సుపారీ ఇచ్చారు, ఎంత సుపారీ ఇచ్చారు అని ఆరాతీశారు. ఆ దృశ్యాలను అక్కడే ఉన్న మరో వ్యక్తి తమ ఫోన్ కెమెరాలో రికార్డ్ చేశారు. తనకు ఎవ్వరూ డబ్బులు ఇవ్వలేదని, కేవలం ఫోటో మాత్రమే ఇచ్చి చంపమన్నారని ఆ షూటర్ తన నేరాన్ని అంగీకరించారు. ఆ తరువాత కౌన్సిలర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వచ్చి ఆ షూటర్‌ను అదుపులోకీ తీసుకున్నారు. షూటర్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది.

కౌన్సిలర్‌పై హత్యాయత్నం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపట్టారు. షూటర్స్ ఇద్దరినీ బీహార్ నుండి రప్పించినట్లు తెలిసింది. కానీ వారికి ఆ కాంట్రాక్ట్ అప్పగించింది ఎవరు అనే విషయం ఇప్పటివరకు తెలియలేదు. చూడ్డానికి అచ్చం సినిమాటిక్ సీన్ తరహాలో కనిపించే ఈ ఘటన కోల్‌కతాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్‌లో 108 వార్డు కౌన్సిలర్ అయిన తృణమూల్ కాంగ్రెస్ నేత సుశాంత ఘోష్‌పైనే ఈ మర్డర్ అటెంప్ట్ జరిగింది. గత 12 ఏళ్లుగా తాను కౌన్సిలర్‌గా ఉన్నానని, కానీ తనపై దాడి జరుగుతుందని అస్సలే ఊహించలేదని కౌన్సిలర్ సుశాంత ఘోష్ తెలిపారు. అది కూడా ఇంటి ముందు కూర్చొన్నప్పుడే ఇలా హత్యాయత్నం చేస్తారని అస్సలే ఊహించలేదంటున్నారు. సుశాంత ఘోష్‌పై మర్డర్ అటెంప్ట్ సీన్ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అవడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories