Kolkata Doctor Case: సుప్రీంకోర్టులో కోల్‌కతా డాక్టర్‌ హత్యాచారం కేసు విచారణ

Kolkata doctor murder case to be heard in Supreme Court
x

Kolkata Doctor Case: సుప్రీంకోర్టులో కోల్‌కతా డాక్టర్‌ హత్యాచారం కేసు విచారణ

Highlights

Kolkata Doctor Case: కేసును విచారిస్తున్న ముగ్గురు సభ్యుల ధర్మాసనం

Kolkata Doctor Case: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ-హాస్పిటల్‌లో వైద్యురాలిపై హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారం లోగా దర్యాప్తుపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. జాతీయస్థాయిలో నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీనియర్, జూనియర్ డాక్టర్ల భద్రతపై సిఫార్సులు చేయాల్సిందిగా టాస్క్‌ఫోర్స్‌కు బాధ్యతలు అప్పగించింది.

కాగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌లో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అధిపతి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఉన్నారు. విచారణ సందర్భంగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఎందుకు ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయలేదని ప్రశ్నించింది. అంతమంది ఆస్పత్రిలో విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఈ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా చేసిన వెంటనే మరో కాలేజీకి వెంటనే నియమించారంటూ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సందేహాలు వ్యక్తం చేశారు.

కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా వైద్యుల భద్రతకు సూచనలు చేసేందుకు ప్రముఖ డాక్టర్లతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. టాస్క్ ఫోర్స్ సభ్యులుగా డాక్టర్ నాగేశ్వరరావు, ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్‌ ఉంటారు. అన్ని వర్గాలను టాస్క్ ఫోర్స్ సంప్రదించి రిపోర్టు తయారు చేయాలని, అన్ని ఆస్పత్రుల్లో సురక్షిత పరిస్థితులను కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. టాస్క్ ఫోర్స్ 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. కాగా ఈనెల 22 కల్లా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇక ఈ కేసు విచారణను ఆగస్టు 22కి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories