UP Businessman Son Kidnapped Case: వ్యాపారవేత్త కుమారుడు కిడ్నాప్.. ఎస్‌టిఎఫ్ ఎలా పట్టుకుందో తెలుసా?

UP Businessman Son Kidnapped Case: వ్యాపారవేత్త కుమారుడు కిడ్నాప్.. ఎస్‌టిఎఫ్ ఎలా పట్టుకుందో తెలుసా?
x
UP Businessman Kidnapped Case:
Highlights

UP Businessman Kidnapped Case: ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలోని కర్నైల్‌గంజ్ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త కుమారుడిని కిడ్నాపర్ల చెర నుంచి సురక్షితంగా రక్షించారు పోలీసులు.

UP Businessman Son Kidnapped Case: ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలోని కర్నైల్‌గంజ్ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త కుమారుడిని కిడ్నాపర్ల చెర నుంచి సురక్షితంగా రక్షించారు పోలీసులు. ఎస్‌టిఎఫ్ (స్పెషల్ టాస్క్ ఫోర్స్) పోలీసులు శుక్రవారం 17 గంటల పాటు శ్రమించి 6 ఏళ్ల బాలుడిని రక్షించారు. ఈ క్రమంలో పోలీసులు, దుండగుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నిందితుల కాళ్లకు బులెట్ గాయాలు అయ్యాయి. ఉదయం 7.15 గంటలకు ఎస్టీఎఫ్, జిల్లా పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఇది విజయవంతమైందని ఏడీజీ లా అండ్ ఆర్డర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ కేసులో యువతి సహా ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. శనివారం ఉదయం, నిఘా ద్వారా గోండాలోని ఘోరిగంజ్ రోడ్‌లో కిడ్నాపర్ల స్థావరాన్ని కనిపెట్టారు.

దీంతో ఎస్టీఎఫ్, పోలీసు బృందం వెంటాడడంతో కారు స్తంభానికి ఢీకొట్టింది. ఈ క్రమంలో ఇద్దరు కిడ్నాపర్లు కారులోంచి దిగి పారిపోయారు. మరో ఇద్దరూ పోలీసు బృందంపై కాల్పులు జరిపారు. ప్రతీకారంగా పోలీసులు కూడా కాల్పులు జరిపి కిడ్నాపర్లను పట్టుకున్నారు. కారు నుండి కిడ్నాప్ చేసిన చిన్నారితో పాటు సూరజ్ పాండే, అతని భార్య చిత్ర పాండే, రాజ్ పాండే, దీపు కశ్యప్, ఉమేష్ యాదవ్ సహా 6 గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. గాయపడిన దుండగులను ఆసుపత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories