Khel Ratna: రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు పేరు మార్పు

Khel Ratna Award Name Changed as Major Dhyan Chand Khel Ratna
x

ఖేల్ రత్న అవార్డు పేరు మార్పు (ఫైల్ ఇమేజ్)

Highlights

Khel Ratna: మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్నగా మారుస్తూ నిర్ణయం * ట్విట్టర్‌ ద్వారా వెల్లడించిన ప్రధాని మోడీ

Khel Ratna: క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్‌రత్న అవార్డుకు పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్నగా పేరునున మారుస్తున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. కొద్ది కాలంగా ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులు రావడంతో.. వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పేరు మార్పు చేసినట్లు తెలిపారు ప్రధాని.

భారత హాకీ జట్టును ముందుండి నడిపించిన ధ్యాన్‌చంద్‌.. హాకీ పితామహుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన కృషితోనే భారత జట్టును ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపారు. అరకొర సౌకర్యాలున్నా దేశానికి ప్రతిష్ట తీసుకురావాలనే సంకల్పంతో తన సత్తా చాటాడు ధ్యాన్‌చంద్‌. అయితే ఒలింపిక్స్‌లో నలభై ఏళ్ల తర్వాత భారత హాకీ జట్లు విశేషంగా రాణించడంతో.. నెటిజన్ల నుంచి ఖేల్‌రత్న అవార్డుకు ధ్యాన్ చంద్‌ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అవార్డు పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.


Show Full Article
Print Article
Next Story
More Stories