మోడీ సొంత రాష్ట్రాన్ని వదిలి వారణాసికి ఎందుకు పారిపోయాడు.. రాహుల్‌గాంధీపై విమర్శలకు ఖర్గే కౌంటర్‌..

Kharge responds to Modis Daro mat bhago mat jibe on Rahul Gandhis nomination from Rae Bareli
x

మోడీ సొంత రాష్ట్రాన్ని వదిలి వారణాసికి ఎందుకు పారిపోయాడు.. రాహుల్‌గాంధీపై విమర్శలకు ఖర్గే కౌంటర్‌..

Highlights

Mallikarjun Karghe: కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు హస్తం పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

Mallikarjun Karghe: కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు హస్తం పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రాన్ని వదిలేసి వారణాసికి ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ గురించి ప్రశ్నించే ముందు ప్రధాని మోదీ తనకు తానుగా వారణాసికి ఎందుకు పారిపోయాడో అడగండి అని మీడియా ప్రతినిధులకు ఖర్గే సూచించారు.

రాహుల్‌గాంధీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి బరిలో దిగుతున్నారు. వాయనాడ్‌లో ఇప్పటికే పోలింగ్‌ కూడా పూర్తికాగా ఇవాళ రాయ్‌బరేలీ నుంచి కూడా కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. దాంతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ప్రధాని సహా బీజేపీ నేతలు రాహుల్‌గాంధీపై విమర్శలు గుప్పిస్తున్నారు.

రాహుల్‌గాంధీ అమేథీలో స్మృతి ఇరానీపై ఓడిపోతానన్న భయంతోనే గత ఎన్నికల్లో వాయనాడ్‌లో కూడా పోటీ చేసి గెలిచారని, ఈ ఐదేళ్లలో వాయనాడ్‌కు ఆయన చేసిందేమీ లేదని, అందుకే అక్కడ ఓటమి భయంతో ఇప్పుడు రాయ్‌బరేలీకి పారిపోయాడని ఎద్దేవా చేస్తున్నారు. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు ఖర్గే ముందు ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories