Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు

Key remarks of West Bengal CM Mamata Banerjee
x

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు

Highlights

Mamata Banerjee: ప్రజల ప్రయోజనం కోసం నేను రాజీనామాకు సిద్ధమే

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌ హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్న జూనియర్‌ వైద్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చల విషయమై ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆర్జీ కర్‌ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. వైద్యులతో సమావేశం కోసం గురువారం దాదాపు రెండు గంటలపాటు ఎదురుచూశానని, అయినప్పటికీ వారి నుంచి స్పందన లేకుండా పోయిందని తెలిపారు.

నేటితో ఈ సమస్యకు తెరపడుతుందని ఆశించిన రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. హత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ పశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా వైద్యవిద్యార్థులు చేస్తున్న నిరసనలు నెల రోజులకుపైగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే వారితో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా సాయంత్రం చర్చలకు రావాలని ఆహ్వానించగా.. 30 మంది ప్రతినిధులకు అనుమతించాలని, ఈ భేటీని ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ వారు షరతులు విధించారు. వాటిని తిరస్కరించిన ప్రభుత్వం.. ఈరోజు మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈ క్రమంలోనే వైద్యులు రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నప్పటికీ.. సమావేశానికి హాజరుకాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories