ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం

Key Development In Delhi Liquor Scam Case
x

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం

Highlights

* సీబీఐ ఛార్జిషీట్‌లో నిందితులపై కీలక అభియోగాలు

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ ఛార్జిషీట్‌లో నిందితులపై కీలక అభియోగాలు వెలుగులోకి వచ్చాయి. అభిషేక్‌ బోయిన్‌పల్లి 20 కోట్ల నుంచి 30 కోట్ల నగదును హవాలా మార్గంలో తరలించినట్టు ఛార్జ్‌షీట్‌లో సీబీఐ పొందుపర్చింది. 2021 జులై-సెప్టెంబర్ మధ్య కాలంలో ఆ డబ్బంతా దినేష్‌ అరోరాకు అభిషేక్ బోయిన్‌పల్లి అందించనట్టు స్పష్టం చేసింది సీబీఐ. దినేష్‌ అరోరా ద్వారా ఆ డబ్బును విజయ్‌ నాయర్‌కు అందజేసినట్టు పేర్కొంది. దక్షిణాది ప్రాంతానికి చెందిన మద్యం ఉత్పత్తి దారుల తరఫున అభిషేక్‌ బోయిన్‌పల్లి ఈ వ్యవహారం నడిపినట్టు సీబీఐ తెలిపింది. శరత్‌ చంద్రారెడ్డి, కవిత, మాగుంట శ్రీనివాస్‌రెడ్డి సౌత్‌ గ్రూపును కంట్రోల్‌ చేశారని అమిత్‌ అరోరా రిమాండ్‌ రిపోర్ట్‌లో ఈడీ పేర్కొందని తెలిపింది. మద్యం పాలసీ రూపకల్పన సమయంలోనే నిందితులు ఈ కుట్రకు పాల్పడ్డారని, మొత్తం ఏడుగురు నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడినట్టు ఛార్జ్‌షీట్‌లో సీబీఐ అధికారులు పొందుపర్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories