JEE Main 2025: జేఈఈ మెయిన్‎లో కీలక మార్పులు..ఇక నుంచి ఆప్షనల్ క్వచ్చన్స్ ఉండవు

JEE Main 2025
x

JEE Main 2025

Highlights

JEE Main 2025: జేఈఈ మెయిన్ పరీక్ష విధానంలో కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇక నుంచి సెక్షన్ బీలో అప్షనల్ క్వచ్చన్స్ ఉండవంటూ పేర్కొంది.

JEE Main 2025: జేఈఈ మెయిన్ పరీక్ష విధానంలో కీలక మార్పులు చేస్తున్నట్లు NTA గురువారం ప్రకటించింది. ఇక నుంచి సెక్షన్ బీలో ఆప్షనల్ క్వచ్చన్స్ ఉండవని వెల్లడించింది. కరోనా సమయంలో విద్యార్థులు పరీక్షకు సిద్ధమయ్యేందుకు ఏర్పడిన ఆటంకాల నేపథ్యంలో 2021 జేఈఈ మెయిన్స్ లో ఎన్టీఏ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. సెక్షన్ బీలో 10 ప్రశ్నలు ఇచ్చి..5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలని విద్యార్థులకు ఆప్షన్ ఇచ్చింది ఎన్టీఏ.

అయితే ఇప్పటి వరకు అనగా 2024 వరకు జేఈఈ ఈ విధానాన్నికొనసాగించింది. 2025 జేఈఈ పరీక్ష నుంచి మాత్రం ఆప్షనల్ ప్రశ్నలు ఉండవని..2021 కు ముందు ఉన్న పద్ధతిలోనే పరీక్ష ఉంటుందని ఎన్టీఏ ప్రకటించింది. సెక్షన్ బీలో 5 ప్రశ్నలే ఇవ్వనున్నట్లు..ఈ 5 ప్రశ్నలకూ సమాధానాలు రాయాల్సి ఉంటుందని తెలిపింది. కరోనా ముగిసింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది.

ఏదైనా భవిష్యత్తు సమాచారం లేదా అప్‌డేట్‌ల కోసం, విద్యార్థులు NTA వెబ్‌సైట్ nta.ac.in లేదా JEE మెయిన్ వెబ్‌సైట్ jeemain.nta.nic.inని సందర్శించాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories