Telangana Budget 2024: బడ్జెట్లో రైతులకు వరాల జల్లులు..బోనస్ డబ్బులపై సర్కార్ కీలక ప్రకటన

Farmer loan waiver funds released today in Telangana
x

 Rythu Runamafi : రైతులకు గుడ్ న్యూస్..నేడే రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల..రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు మాఫీ

Highlights

Telangana Budget 2024:

Telangana Budget 2024: తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం తాజా బడ్జెట్లో కీలక ప్రకటన వెలువరించింది. ఈ ప్రకటనతో చాలా మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. ఇప్పటికే రైతులకు రైతు బంధు వంటి స్కీమ్ ను అందించింది. దీంతో ప్రతిఏటా రైతులకు రూ. 15వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం పేర్కొంటుంది.

ఇకా రూ. 2లక్షల రుణమాఫీ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు రైతు కూలీలకు ప్రయోజనాలను అందించాలని ప్రభుత్వం వెల్లడించింది. పొలం లేని రైతుల కూలీలకు ఏటా ఆర్థిక సాయం అందిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రైతు కూలీలకు మేలు జరుగుతుందని చెప్పవచ్చు.

ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు కూడా సాయం అందిస్తామని వెల్లడించారు. లక్ష ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. అంతేకాదు రైతుల కోసం ఫసల్ బీమా యోజన స్కీమ్ ను కూడా త్వరలో తీసుకువస్తామని తాజా బడ్జెట్లో ప్రభుత్వం తెలిపింది. దీంతో రైతులకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాదు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాతలకు క్వింటాల్ కు రూ. 500 బోనస్ డబ్బులు అందిస్తామని తాజా బడ్జెట్లో పేర్కొంది.

అయితే ఈ ప్రయోజనం అందరికీ అందదు. కేవలం సన్నబియ్యం పండించే రైతులకు మాత్రమే ఈ ప్రయోజనం లభిస్తుంది.దీనివల్ల రైతు కూలీలకు ప్రయోజనం చేరుకూరుతుంది. అటు చిల్డ్రన్ పార్క్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రూ. 500 గ్యాస్ సిలిండర్‌ స్కీమ్‌కు రూ. 700 కోట్లకు పైగా కేటాయించామని తెలిపింది. రీజినల్ రింగ్ రోడ్‌కు రూ. 1525 కోట్లు కేటాయిచండంతోపాటు..కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రాకు రూ.200 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.

Show Full Article
Print Article
Next Story
More Stories