Money: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ప్రతినెలా బ్యాంకు ఖాతాలో రూ. 1000 జమ

Money: మహిళలకు అదిరిపోయే శుభవార్త..  ప్రతినెలా బ్యాంకు ఖాతాలో రూ. 1000 జమ
x
Highlights

Money: మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది ఢిల్లీ సర్కార్. మహిళల బ్యాంకు అకౌంట్లకు రూ. 1000 రూపాయలు బదిలీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ...

Money: మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది ఢిల్లీ సర్కార్. మహిళల బ్యాంకు అకౌంట్లకు రూ. 1000 రూపాయలు బదిలీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద దీని రిజిస్ట్రేషన్ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

వచ్చే ఏడాది మొదటి నెలలో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో బిజీగా మారారు. ఈ సందర్భంగా ఢిల్లీ మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఢిల్లీలోని మహిళలకు నెలవారీ రూ.1,000 గౌరవ వేతనం అందించడానికి ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద రిజిస్ట్రేషన్ త్వరలో ప్రారంభమవుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం తెలిపారు. ఈశాన్య ఢిల్లీలోని బురారీలో ఆప్ పాదయాత్ర ప్రచారం సందర్భంగా ఈ పథకం గురించి కేజ్రీవాల్ మాట్లాడారు. ఈ స్కీంకు దరఖాస్తు చేసుకునే మహిళలు స్థానికంగా ఓటర్ నమోదు అయి ఉండాలని తెలిపారు.

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతృత్వంలోని ప్రభుత్వం మార్చిలో సమర్పించిన 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనను ప్రకటించింది. 2,000 కోట్లతో 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ.1,000 చెల్లిస్తామని హామీ ఇచ్చింది. పాదయాత్రకు తరలివచ్చిన మహిళలతో కేజ్రీవాల్ మాట్లాడుతూ, నేను మీకోసం పనిచేస్తున్నారు. త్వరలో రూ. 1,000 (నెలకు) మీ ఖాతాలకు జమ అవుతుంది. పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అతి త్వరలో ప్రారంభమవుతుందని.. అయితే ఒక కండిషన్ ఉందని..కేవలం ఢిల్లీలో ఓటరు అయి ఉన్న మహిళలకే ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.

కాగా ఈసారి అరవింద్ కేజ్రీవాల్ తన ఎన్నికల ప్రచారాన్ని ఆప్ నేతృత్వంలోని ప్రభుత్వం అందించే ఆరు ఉచిత సౌకర్యాలపై దృష్టి పెట్టారు. ఈ అంశంపై బీజేపీని కార్నర్ చేసేందుకు ప్రయత్నిస్తున్న కేజ్రీవాల్.. ప్రతిపక్ష పార్టీ ‘ఉచిత రేవారీ’ అంటుందన్నారు. అవి తమ సొంత పన్నుల సొమ్ముతో ప్రజలకు ఇస్తున్న ఉచిత సౌకర్యాలు తప్ప మరొకటి కాదని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories