Karnataka Results 2023: కర్ణాటక పోరులో కాంగ్రెస్ దూకుడు.. ఓటమి దిశగా బీజేపీ హేమాహేమీలు..

Karnataka Results 2023: కర్ణాటక పోరులో కాంగ్రెస్ దూకుడు.. ఓటమి దిశగా బీజేపీ హేమాహేమీలు..
x

Karnataka Results 2023: కర్ణాటక పోరులో కాంగ్రెస్ దూకుడు.. ఓటమి దిశగా బీజేపీ హేమాహేమీలు..

Highlights

Karnataka Election Results 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది.

Karnataka Election Results 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. ఒపీనియన్ పోల్స్, ఎగ్జిల్ పోల్స్ అంచనా వేసిన విధంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందనే విషయాన్ని ఎర్లీ ట్రెండ్స్ స్పష్టం చేశాయి. ఇక కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో ముందంజలో ఉండటం.. అధికారం దక్కించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 113కు చేరువ కావడంతో ఆ పార్టీ శ్రేణులు, నాయకుల్లో ఉత్సాహం నెలకొంది. ఫలితాలు ముగిసే వరకు కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని.. మ్యాజిక్ ఫిగర్ దాటి తమకు మరిన్ని సీట్లు అదనంగా వస్తాయని ఆ పార్టీ ధీమాగా ఉంది.

ఇక కర్నాటకలో మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని భావించిన బీజేపీ ఆశలు ఫలిస్తున్నట్టు కనిపించడం లేదు. ఆ పార్టీ ముఖ్యనేతలు చాలా చోట్ల ఎదురీదుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. 8 నుంచి 10 మంది మంత్రులు చాలా చోట్ల వెనుకంజలో ఉండటం బీజేపీ శ్రేణులకు షాక్ ఇస్తోంది. అధికార పార్టీపై కర్ణాటక ప్రజల్లో వ్యతిరేక ఉందని విపక్ష కాంగ్రెస్ మొదటి నుంచి గట్టిగా వాదిస్తోంది. అందుకు తగ్గట్టుగానే పలు చోట్ల మంత్రులు వెనుకంజలో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories