Karnataka: హెల్మెట్ లేకుంటే లైసెన్స్ రద్దు..

Karnataka: హెల్మెట్ లేకుంటే లైసెన్స్ రద్దు..
x

Karnataka: హెల్మెట్ లేకుంటే లైసెన్స్ రద్దు..

Highlights

Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నది

Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నది. ఒకవేళ హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలలపాటు రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. సోమవారం జారీ చేసిన ఆదేశాల్లో కర్ణాటక ప్రభుత్వం స్పష్టంచేసింది.

మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 129 ప్రకారం, వాహనం నడిపే ప్రతి వ్యక్తి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న హెల్మెట్‌ ధరించాలి. ఈ నిబంధనలు ఉల్లంఘించినవారు రూ.1,000 జరిమానా విధిస్తారు. దాంతో పాటు లైసెన్స్‌ను మూడు నెలల పాటు సస్పెన్షన్ చేయాలని చట్టం సూచిస్తుంది.హెల్మెట్ లేకుండా వాహనం నడపడం రాష్ట్రంలో అత్యధిక రహదారి ఉల్లంఘనలలో ఒకటిగా ఉన్నందున.. ఇలాంటి డ్రైవింగ్‌ను అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే వ్యక్తులందరికీ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే సుప్రీం కోర్టు ఆదేశించిన త‌రువాత ఉత్తర్వులను కర్ణాటక ప్రభుత్వం తీసుకువచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories