Karnataka Exit Poll 2023: కర్ణాటక ఎగ్జిట్ పోల్స్..హస్తందే హవా..

Karnataka Election 2023 Exit Poll Results Out
x
Highlights

Exit Poll Results 2023: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 224 నియోజకవర్గాలకు బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం అయిన పోలింగ్ సాయంత్రం 6...

Exit Poll Results 2023: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 224 నియోజకవర్గాలకు బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం అయిన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. గత ఎన్నికల్లో 72.13 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి తగ్గింది. సాయంత్రం 5వరకు 65.69 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇకపోతే కర్ణాటక వ్యాప్తంగా 2615 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 58,545 పోలింగ్ బూతుల్లో పోలింగ్ జరిగింది. 5 కోట్ల 31 లక్షల మంది ఓటర్లు పోలింగ్ లో పాల్గొన్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 13న విడుదల కానున్నాయి. అయితే పలు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి.

పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్

పీపుల్స్ పల్స్ తన నివేదికలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తన సర్వే నివేదికలో తెలిపింది. కాంగ్రెస్ పార్టీ కి 107 నుంచి 119 స్థానాలు దక్కుతాయని తెలిపింది. ఇక ఇదే సమయంలో బీజేపీ 70 నుంచి 90 స్థానాల్లో గెలుపొందుతుందని అంచనా వేసింది. జేడీఎస్ 23 నుంచి 29 స్థానాల్లో సత్తా చాటే అవకాశం ఉందని తెలిపింది. ఇతరులకు 1 నుంచి 3 స్థానాలు దక్కుతాయని పీపుల్స్ పల్స్ తన ఎగ్జిట్ పోల్స్ సర్వేలో పేర్కొంది

రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్

రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ లో కూడా కాంగ్రెస్ కే ఎక్కువ సీట్లు వస్తాయని బయటపడింది. కాంగ్రెస్ పార్టీకి 94 నుంచి 108 స్థానాలు వచ్చాయని బీజేపీకి 85 నుంచి 100 స్థానాలు దక్కుతాయని పేర్కొంది. ఇక జేడీఎస్ కు 24 నుంచి 32 అసెంబ్లీ సీట్లు వస్తాయని తెలిపింది. ఇతరుల ప్రభావం 2 నుంచి 6 స్థానాల్లో ఉంటుందని ప్రకటించింది.

జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్

జన్ కీ బాత్ సర్వే ప్రకారం చూస్తే కాంగ్రెస్ 91 నుంచి 106 స్థానాల్లో గెలుపొందుతుంది. అదే సమయంలో బీజేపీ 94 నుంచి 117 స్థానాలు దక్కే అవకాశం ఉందని తన సర్వే రిపోర్ట్ లో పేర్కొంది. ఇక జేడీఎస్ 14 నుంచి 26 స్థానాలు కైవసం చేసుకుంటుందని జన్ కీ బాత్ సర్వే తేల్చింది. ఈ సర్వే ప్రకారం హంగ్ ఏర్పడే ఛాన్స్ ఉంది.

జీ మ్యాట్రిస్ సర్వే

జీ మ్యాట్రిస్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలో కాంగ్రెస్ కే అత్యధిక సీట్లు దక్కాయి. హస్తం పార్టీకి 103 నుంచి 118 స్థానాలు వస్తాయని జీ మ్యాట్రిస్ అంచనా వేసింది. ఇక కమలం గుర్తుకు 79 నుంచి 94 స్థానాలు దక్కుతాయని తెలిపింది. జేడీఎస్ కు 25 నుంచి 33 స్థానాలు వస్తాయని తెలిపింది.

పీ మార్గ్ సర్వే

ఇక పీ మార్గ్ సర్వే సైతం కాంగ్రెస్ కే మొగ్గు చూపింది. కాంగ్రెస్ కు 94 నుంచి 108 స్థానాలు వస్తాయని సర్వేలో తేల్చింది. బీజేపీకి 85 నుంచి 100 స్థానాలు వస్తాయని తెలిపింది. ఇక జేడీఎస్ 24 నుంచి 32 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేసింది.

మొత్తంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. ఒపీనియన్ పోల్స్ కు అనుగుణంగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఉన్నాయి. ఒపీనియన్ పోల్స్ సర్వేలో కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా అలాంటి రిజల్ట్స్ నే ఇప్పుడు ఇచ్చాయి. మొత్తానికి, కర్ణాటకలో హస్తం హవా ఉంటుందని సర్వేలు వెల్లడించాయి. ఈ సర్వే పోల్స్ తో కాంగ్రెస్ లో నయా జోష్ తొళికిసలాడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories