Court Summons Issues to CM Yediyurappa: యడియూరప్పకు కోర్టు సమన్లు

Court Summons Issues to CM Yediyurappa:  యడియూరప్పకు కోర్టు సమన్లు
x
Karnataka Court Issues Summons to CM Yediyurappa For Violating Election Code
Highlights

Court Summons Issues to CM Yediyurappa: ఎన్నికల నియమావళిని ఉల్లఘించారని కర్ణాటక సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్‌ యడియూరప్పకు కోర్టు సమన్లు జారీ చేసింది.

Court Summons Issues to CM Yediyurappa: ఎన్నికల నియమావళిని ఉల్లఘించారని కర్ణాటక సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్‌ యడియూరప్పకు కోర్టు సమన్లు జారీ చేసింది. వివ‌రాల్లోకెళ్తే.. 2019లో గోకక్‌ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన‌ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం నియమావళిని ఉల్లంఘించారంటూ పిటిష‌న్‌ దాఖలైంది. ఈ పిటిష‌న్‌పై గోకక్‌‌లోని ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ విచార‌ణ చేపట్టింది. ఈ క్రమంలో సీఎం యడియూరప్పకు న్యాయ‌స్థానం స‌మ‌న్లు జారీ చేసింది. ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో యడియూరప్ప రెండుసార్లు కులం ప్ర‌స్తావ‌న తెచ్చార‌నీ, అది ఎన్నిక‌ల నియ‌మావ‌ళికి విరుద్ధ‌మ‌ని, కుల ప్ర‌స్తావ‌న ఎందుకు వ‌‌చ్చిందో వివ‌ర‌ణ ఇవ్వాలంటూ కోర్టు వివరణ కోరింది.

ఆ ప్ర‌చారంలో ఓట‌ర్ల‌ను ఉద్దేశించి మాట్లాడిన సీఎం.. రెండుసార్లు కులం ప్రస్తావ‌న తెచ్చారు. వీర‌శైవ లింగాయ‌త్‌ల ఓట్లు చీలిపోకుండా చూసుకోవాల‌ని ఓట‌ర్ల‌ను కోరారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్ర‌చారంలోయడియూర‌ప్ప కులం ప్ర‌స్తావ‌న తేవ‌డంతో ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించార‌ని పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గోకక్ పీఎస్‌లో కేసు నమోదుకావడం, ఆపై కోర్టు విచారణ జరపడంతో సీఎంకు సమన్లు జారీ అయ్యాయి. కాగా, దీనిపై కర్ణాటక సీఎం ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories