ఢిల్లీ ఆర్మీ హౌస్‌లో అట్టహాసంగా విజయ్ దివస్

Kargil Vijay Diwas Was Celebrated Wonderfully In Delhi Army House
x

ఢిల్లీ ఆర్మీ హౌస్‌లో అట్టహాసంగా విజయ్ దివస్

Highlights

* పాకిస్థాన్‌పై విజయానికి సంకేతంగా విజయోత్సవం.. విజయ్ దివస్‌లో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము, ప్రదాని మోడీ

Kargil Vijay Diwas: ఢిల్లీ ఆర్మీ హౌస్‌లో విజయ్ దివస్ అట్టహాసంగా జరిగింది. ఆర్మీ హౌస్‌లో 1971 బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో పాకిస్తాన్‌పై భారతదేశం సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ విజయ్ దివస్ పేరుతో విజయోత్సవ వేడుకలు జరిగాయి. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యవేక్షణలో జరిగిన విజయ్ దివస్‌లో ఆర్మీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. ఎట్ హోమ్‌పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, సైనికాధికారులు పాల్గొన్నారు.

ఆర్మీహౌస్ ఆవరణలో విజయ్ దివస్ ప్రాముఖ్యతను వివరిస్తూ వీడియో ప్రదర్శన నిర్వహించారు. యాభై సంవత్సరాల క్రితం, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సైనిక లొంగుబాటు జరిగింది, పాకిస్తాన్ సైన్యం నుండి 93వేల మంది సైనికులు తమ ఆయుధాలను భారత దళాల ముందు ఉంచారు - ఫలితంగా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి పొందింది. డిసెంబర్ 16, 1971న, లెఫ్టినెంట్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ, తూర్పు పాకిస్తాన్ యొక్క చీఫ్ మార్షల్ లా అడ్మినిస్ట్రేటర్ మరియు తూర్పు పాకిస్తాన్‌లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ కమాండర్, లొంగుబాటు సాధనంపై సంతకం చేశారు. ఈ సన్నివేశాలను తిలకించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక అనుభూతికి లోనయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories