Kallakkadal: కల్లక్కడల్ ముప్పు..కేరళ, తమిళనాడుకు ముందస్తు హెచ్చరికలు జారీ

Kallakkadal: కల్లక్కడల్ ముప్పు..కేరళ, తమిళనాడుకు ముందస్తు హెచ్చరికలు జారీ
x
Highlights

Kallakkadal: కేరళ, తమిళనాడు తీరాలకు కల్లక్కడల్ ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. జనవరి 15న రాత్రి ఆకస్మాత్తుగా...

Kallakkadal: కేరళ, తమిళనాడు తీరాలకు కల్లక్కడల్ ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. జనవరి 15న రాత్రి ఆకస్మాత్తుగా సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన అలలు ఎగసిపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ రోజు రాత్రి 11.30 గంటల వరకు తీరంలోని పలు ప్రాంతాల్లో 0.5మీటర్ల నుంచి 1 మీటర్ల మే అలల తాకిడి ఉంటుందని సముద్ర ఉప్పెన ముప్పు పొంచి ఉందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ హెచ్చరికలు జారీ చేసింది.

ఐఎన్ సీవోఐఎస్ సమాచారం ఇచ్చిన నేపథ్యంలో కేరళ విపత్తు ప్రతిస్పందన నిర్వహణ సంస్థ కేఎస్ డీఎంఏ అప్రమత్తం అయ్యింది. అధికారుల సూచన మేరకు తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని సూచించింది. తీర ప్రాంత వాసులు ఎట్టి పరిస్థితుల్లో చిన్న పడవలు, దేశవాలీ పడవలు వేసుకుని సముద్రంలోకి వెళ్లొద్దంటూ హెచ్చరించింది. ముందుగానే పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రకటించింది. ప్రస్తుతం జారీ చేసిన ప్రకటనను విరమించుకునే వరకు పర్యాటకులు బీచ్ లలో విహారానికి వెళ్లకూడదని అధికారులు విజ్నప్తి చేశారు. తీర ప్రాంతాలపై అదనపు నిఘా ఉంచాలని అధికారులకు కేఎస్ డీఎంఏ సూచించింది.

కల్లక్కడల్ అంటే ఏంటి?

కలక్కడల్ అనేది సముద్రంలో ఆకస్మాత్తుగా సంభవించే మార్పు. అంటే సముద్రం ఓ దొంగ మాదిరి దూసుకొస్తుందని అర్థం. హిందూ మహాసముద్రంలోని దక్షిణ భాగంలో కొన్నిసార్లు వీచే బలమైన గాలులే సముద్రం ఇలా ఆకస్మాత్తుగా ఉప్పొంగడానికి కారణమని ఐఎన్ సీవోఐఎస్ సంస్థ తెలిపింది. ఎలాంటి సూచన, హెచ్చరిక లేకుండానే ఆ గాలులు వీస్తాయని పేర్కొంది. అందుకే దీనిని స్థానికంగా కల్లక్కడల్ అని పిలుస్తారని పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories