NHRC Chairman: జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా జస్టిస్ అరుణ్ మిశ్రా

Justice Arun Mishra as NHRC new Chairman
x

Justice Arun Mishra:(The Hans India)

Highlights

NHRC Chairman: జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్చార్సీ) నూతన చైర్మన్ గా జస్టిస్ అరుణ్ మిశ్రా నియమితులయ్యారు.

NHRC Chairman: జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్చార్సీ) నూతన చైర్మన్ గా జస్టిస్ అరుణ్ మిశ్రా నియమితులయ్యారు. ఐదుగురు సభ్యుల హైలెవల్ కమిటీ అరుణ్ మిశ్రా పేరు ఖరారు చేసింది. జస్టిస్ అరుణ్ మిశ్రా 6 సంవత్సరాలు సుప్రీంకోర్టు జడ్జిగా వ్యవహరించారు. 2020లో ఆయన పదవీవిరమణ చేశారు. అరుణ్ మిశ్రా కలకత్తా, రాజస్థాన్ హైకోర్టులకు చీఫ్ జస్టిస్ గా వ్యవహరించారు.

హైలెవల్ కమిటీలో ఒకరైన రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఎన్ హెచ్చార్సీ చైర్మన్ గా దళిత, ఆదివాసీ, మైనారిటీ వర్గాల సభ్యుల్లో ఒకరిని ఎంపిక చేయాలని పట్టుబట్టారు. కానీ, కమిటీలో అత్యధికులు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా వైపే మొగ్గుచూపారు. దాంతో ఖర్గే ఈ నియామకంతో ఏకీభవించక, నిరసన నోట్ నమోదు చేసినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories