Ayodhya: అయోధ్యలో వరద నీటిలో మునిగిన జవాన్ల శిబిరాలు

Ayodhya: అయోధ్యలో వరద నీటిలో మునిగిన జవాన్ల శిబిరాలు
x

Ayodhya: అయోధ్యలో వరద నీటిలో మునిగిన జవాన్ల శిబిరాలు

Highlights

Ayodhya: ఉత్తరప్రదేశ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరంలో పైకప్పులో ఏర్పడిన లీకేజీల వల్ల వర్షం నీరు గర్భగుడిలోకి కారుతుందన్న వార్తలు ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. అయోధ్య రామ మందిర రక్షణ బాధ్యతలు చూసే ప్రొవెన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబుల్ జవాన్ల శిబిరాల్లోకి ఇప్పుడు వరద నీరు చేరింది.

Ayodhya: యూపీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామమందిరంలో పైకప్పులో ఏర్పడిన లీకేజీల వల్ల వర్షం నీరు గర్భగుడిలోకి నీరు కారుతుందన్న వార్తలు ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. తాజాగా అయోధ్య రామమందిర రక్షణ బాధ్యతలు చూసే ప్రొవెన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబుల్ జవాన్ల శిబిరాల్లోకి వరద నీరు చేరింది.

మీర్జాపూర్ లోని కాన్షీరాం కాలనీలో ఉన్నవారి శిబిరాలు ఇప్పుడు వరద నీటిలో మునిగిపోయాయి. వారి వస్తువులన్నీ కూడా నీటిలో తేలియాడుతున్నాయి. శిబిరాల్లో మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో జవాన్లు ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

అటు అయోధ్య మందిరంలోని గర్భగుడి పైకప్పు నుంచి కారిన వర్షం నీరు పేరుకుపోతుందంటూ ప్రధాన పూజారి చేసిన ఆరోపణలను రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా మంగళశారం దీనిని ఖండించారు. గర్భగుడిలో ఎలాంటి లీకేజీలు లేవని..విద్యుత్తు వైర్లు బిగించడానికి ఏర్పాటు చేసిన పైపు లైన్ల ద్వారా కొద్దిగా నీరు కిందికి వచ్చినట్లు ఆయన వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories