సోషల్ మీడియా మీమ్‌ డాగ్ ఇక లేదు

Japanese Dog Kabosu Dies
x

క్రిప్టో ఐకాన్‌, మన సోషల్ మీడియా చింటూ డాగ్ కబొసు ఇక లేదు.. 

Highlights

జపనీస్ షిబా ఇను జాతికి చెందిన కబోసు మృతి

Japanese Dog Kabosu Dies: సోషల్ మీడియాలో మీమ్ డాగ్‌గా సెన్సెషన్ సృష్టించిన డాగ్ కబోసు ఇక లేదు. జపాన్‌‌లో ఎక్కువగా వృద్ధి చెందే షిబా ఇను జాతికి చెందిన 19 ఏళ్ల కబోసు మృతి చెందినట్టు దాని యజమాని ప్రకటించారు. డాగ్ చనిపోవడానికి ముందు రోజు రాత్రి ఎప్పటిలాగే భోజనం చేసి..కడుపునిండా నీళ్లు తాగిందని.. ఉదయం నిద్రలేచే విగతజీవిగా పడిఉన్నట్టు గుర్తించామని యజమాని వివరించారు.

తనకు ఎంతో విశ్వాసంగా ఉండే... కబోసు.. ఎప్పుడూ... చలాకీగా ఆడుతూ.. ఇంట్లో తిరిగేదని.... ఆరోజు ఉత్సాహంగానే ఉంది. ఎప్పటిలాగే రైస్ తిని పుష్కలంగా నీరు తాగి పడుకుంది. పడుకునే ముందు ఆడుకుని.. మెల్లెగా నిద్రలోకి జారుకుంది. నిద్రలోనే నిశ్శబ్దంగా మరణించిందని యజమాని వెల్లడించారు.

ఇంటర్నెట్ సెన్సేషన్ చక్కటి చిరునవ్వుతో మీమ్స్‌లో నవ్వించిన వైరల్ డాగ్ కబోసు ఇకలేదు. అయితే, ఈ డాగీ సోషల్ మీడియాలోనే కాదు.. క్రిప్టోకరెన్సీలో కూడా ఫేమస్, క్రిప్టోకరెన్సీలో డాగీ కాయిన్ కూడా ఒకటి. దాని సింబల్‌గా కబోసు ముఖాన్నే వాడారు. క్రిప్టో ప్రపంచంలో ఎనిమిదో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ డాగీ కాయిన్. బిట్ కాయిన్ తర్వాత ఎక్కువ మంది గూగుల్‌లో సెర్చ్ చేసిన క్రిప్టో కరెన్సీ డాగ్ కాయిన్ మాత్రమే.

మరోవైపు దీనిలాగే చీమ్స్ పేరుతో పాపులర్ అయిన బాల్ట్జ్ డాగ్ కూడా ఇటీవలే చనిపోయింది. అది కూడా 2023 ఆగస్టు నెలలో క్యాన్సర్‌తో చనిపోయింది. తాజాగా కబోసు కూడా చనిపోవడంతో ఆజాతికి చెందిన డాగ్ లావర్స్‌తోపాటు నెటిజన్లు విషాదంలో ఉన్నారు. కాగా, ఈ డాగ్‌ తెలుగు మీమ్స్‌లో కూడా ఎంతో పాపులర్, తెలుగులో ఈ డాగ్‌ను చిమ్‌టు అని ముద్దుగా పిలుచుకుంటారు. చిమ్‌టుకి మరణం లేదని నెటిజన్లు వాటికి నివాళులు అర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories