70 సీట్ల విమానంలో కేవలం 5 మంది ప్రయాణికులే!

70 సీట్ల విమానంలో కేవలం 5 మంది ప్రయాణికులే!
x
Highlights

కరోనా మానవుని జీవనశైలిలో చాలా మార్పు తీసుకొచ్చింది. వైరస్ సోకకుండా సోషల్ డిస్టెన్స్ పాటించాలన్న నిబంధనను కొన్ని కొన్ని చోట్ల ప్రజలు ఖచ్చితంగా...

కరోనా మానవుని జీవనశైలిలో చాలా మార్పు తీసుకొచ్చింది. వైరస్ సోకకుండా సోషల్ డిస్టెన్స్ పాటించాలన్న నిబంధనను కొన్ని కొన్ని చోట్ల ప్రజలు ఖచ్చితంగా పాటిస్తున్నారు. అందులో ముఖ్యంగా రైళ్లు, విమానాల్లో అయితే ఎక్కువగా కనిపిస్తుంది. లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపు రెండు నెలల పాటు ఖాళీగా ఉన్న విమానాలు గతనెల ఎగరడం ప్రారంభించాయి. విమానాలు అయితే తిప్పుతున్నారు కానీ అందులో ప్రయాణికులు మాత్రం ఎక్కడం లేదు. చాలా విమానాల సీట్ కెపాసిటీలో కనీసం 30 శాతం కూడా బుక్ అవ్వడం లేదు.

గురువారం జైపూర్ నుండి ఆగ్రాకు ఎగిరిన ఎయిర్ ఇండియా విమానంలో ఉదయం 5 మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించారు. అదే సమయంలో ఆగ్రా నుండి జైపూర్ వరకు ఆరుగురు ప్రయాణికులు ప్రయాణించగా, విమానం ప్రయాణీకుల సామర్థ్యం 70 సీట్లు. అటువంటిది ఈ విమానం అప్ అండ్ డౌన్ 10 శాతం కంటే తక్కువ ప్రయాణీకుల భారాన్ని మోసింది.

విశేషమేమిటంటే, ఈ విమానంలో సోమవారం ఒక ప్రయాణీకుడు మాత్రమే ప్రయాణించారు. అదేవిధంగా, మరొక విమానంలో, ప్రయాణీకుల భారం 20 శాతం కంటే తక్కువగా ఉంది. 180 సీటింగ్ సామర్ధ్యం ఉన్న ఎయిర్ ఇండియా విమానం సాయంత్రం, జైపూర్ నుండి ఢిల్లీకి కేవలం 32 మంది ప్రయాణికులతో మాత్రమే బయలుదేరింది, ఇది 20 శాతం కంటే తక్కువ. ప్రయాణీకుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ఎయిర్ ఇండియా గురువారం మూడు విమానాలను నడిపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories