Puri Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్ర తొక్కిసలాట.మృతుని కుటుంబానికి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా

Puri Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్ర తొక్కిసలాట.మృతుని కుటుంబానికి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా
x

Puri Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్ర తొక్కిసలాట.మృతిని కుటుంబానికి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా

Highlights

Puri Jagannath Rath Yatra:

Puri Jagannath Rath Yatra:ఒడిశాలోని పూరీలో జగన్నాథుని రథయాత్ర సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 15 మంది భక్తులు గాయపడ్డారు. తొక్కిసలాటలో ఊపిరాడక ఓ భక్తుడు మరణించాడు. తొక్కిసలాటలో గాయపడిన భక్తులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో చాలా మంది భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. చాలా మంది భక్తులు ప్రథమ చికిత్స తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యారు. తీవ్రంగా గాయపడిన భక్తులకు చికిత్స కొనసాగుతోంది. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ మృతిని కుటుంబానికి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతోపాటు, గాయపడిన వారికి ఉచిత చికిత్స అందించాలని ప్రకటించారు.

పూరీలో రథయాత్ర సందర్భంగా బలభద్ర భగవానుడి తాళధ్వజ్ రథాన్ని లాగుతుండగా ఊపిరాడక ఓ భక్తుడు మృతి చెందినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. అయితే అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. 53 ఏళ్ల తర్వాత పూరీలో జగన్నాథుని రథయాత్ర రెండు రోజుల పాటు జరుగుతోంది. 1971 నుంచి ఈ రథయాత్ర ఒకరోజు పాటు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది రెండు రోజులుగా చేశారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ రథయాత్రలో నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

పూరీ రథయాత్రలో బలభద్రుడి రథాన్ని లాగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలో ఓ వ్యక్తి కింద పడిపోయాడు. నేలపై పడి భక్తుడు మృతి చెందాడు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 15 మంది గాయపడ్డారు. ఈసారి జగన్నాథుడు తన సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రతో కలిసి రెండు రోజుల్లో అత్త ఇంటికి చేరుకుంటాడు.ఈ రథయాత్రలో పాల్గొంటే 100 యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. దీంతో ఈ రథయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories