కొల్లేరులో ఎటుచూసినా విదేశీ పక్షులే..!

Its The Breeding Season And The Migrant Birds Are Here Already
x

కొల్లేరులో ఎటుచూసినా విదేశీ పక్షులే

Highlights

* లక్షలాది కిలోమీటర్ల నుంచి అరుదైన పక్షుల రాక

Migrant Birds: వలస పక్షులతో కొల్లేరు కళకళలాడుతుంది. విదేశీ అతిథుల రాకతో అక్కడ సందడి మొదలైంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో విస్తరించిన కొల్లేరు ప్రాంతంలో విదేశీ పక్షులు కనువిందు చేస్తున్నాయి. శీతాకాలం విడిది కోసం సైబీరియా, రష్యా, యూరప్. టర్కీతో పాటు పలు దేశాల నుంచి ఏటా ఈ పక్షులు కొల్లేరు ప్రాంతానికి చేరుకుంటాయి.

అందరికీ విదేశీ పక్షుల్లా గానే కనిపించే ఈ పక్షులు కొల్లేరు ప్రాంతం వాసులకు మాత్రం ఇంటి ఆడపడుచులుగా ప్రతి ఏడాది ఇక్కడికి వస్తుంటాయి. రాష్ట్రంలో కొల్లేరు అభయారణ్యం. 77.185 ఎకరాలలో విస్తరించి ఉంది . ఏటా కొల్లేరుకు దాదాపు 6 లక్షల విదేశీ పక్షులు వలస వస్తున్నాయి. అక్టోబర్ లో వలస బాట పట్టే ఈ విహంగాలు ఇక్కడే సంతానో ఉత్పత్తి చేసుకొని మార్చి నెలలో తిరిగి ప్రయాణం అవుతాయి కొల్లేరు అభయారణ్యంలో. 190 జాతులకు చెందిన పక్షులు జీవనం సాగిస్తాయి. ఏలూరు జిల్లా కైకలూరు మండలం ఆటపాక పక్షుల విహార కేంద్రానికి పెలికాన్ పక్షులు వేలాదిగా రావడంతో సందడి మొదలైంది. పక్షుల అందాన్ని తిలకించేందుకు పర్యాటకులు వేల సంఖ్యలో వస్తారు. ఫారెస్ట్ అధికారులు పర్యాటకులకు బోటు షికారు ఏర్పాటు చేశారు

కిక్కిస పొదలు అందమైన జలదారుల నడుమ ప్రకృతి పంపిన రాయబారులు రాజహంసల్లా సందడి చేస్తున్నాయి. వలస పక్షులతో కొల్లేరు కళకళలాడుతోంది. శీతాకాలం విడిది కోసం సైబీరియా, నైజీరియా, రష్యా, టర్కీ, యూరప్‌ దేశాల నుంచి వలస పక్షులు ఏలూరు, పశ్చిమ గోదా­వరి జిల్లాల నడుమ విస్తరించిన కొల్లేరు ప్రాంతానికి చేరుకున్నాయి. అందరికీ విదేశీ పక్షులుగానే కనిపించే ఈ విహంగాలు కొల్లేరు ప్రాంత వాసులకు మాత్రం ఇంటి ఆడపడుచులుగా ఏటా ఇక్కడకు విచ్చేస్తాయి.

6 లక్షల పక్షుల రాక

రాష్ట్రంలో కొల్లేరు అభయారణ్యం 77,185 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఏటా కొల్లేరుకు దాదాపు 6 లక్షల విదేశీ పక్షులు వలస వస్తున్నాయి. అక్టోబర్‌లో వలసబాట పట్టే ఈ విహంగాలు ఇక్కడే సంతానోత్పత్తి చేసుకుని మార్చిలో తిరిగి పయనమవుతాయి. కొల్లేరు అభయారణ్యంలో 190 జాతులకు చెందిన పక్షులు జీవనం సాగిస్తున్నాయి. ఏలూరు జిల్లా ఆటపాక పక్షుల విహార కేంద్రానికి పెలికాన్‌ పక్షులు వేలాదిగా రావడంతో దీనికి పెలికాన్‌ ప్యారడైజ్‌గా నామకరణం చేశారు. ఏలూరు రేంజ్‌ అటవీ శాఖ ఆధ్వర్యంలో నాలుగు వారాలుగా పక్షుల లెక్కింపు జరుగుతోంది.

డిసెంబర్‌ రెండో వారానికి దాదాపు స్వదేశీ, విదేశీ పక్షులు 5 లక్షల 20 వేలను గుర్తించారు. ఏటా శీతాకాలంలో విదేశీ వలస పక్షులు 6 లక్షలు, స్వదేశీ పక్షులు 3.50 లక్షల వరకు గుర్తిస్తున్నామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. కొల్లేరు ప్రాంతంలో స్పాట్‌ బిల్డిన్‌ పెలికాన్, కామన్‌ శాండ్‌పైపర్, బ్లాక్‌ వింగ్డ్‌ స్టిల్ట్, గ్లోబీ ఐబీస్, పెయింటెడ్‌ స్టార్క్, రివర్‌ టర్న్, జకనా, లార్జ్‌ విజిటింగ్‌ డక్, ఓరియంటల్‌ డాటర్, కామన్‌ రెడ్‌ షంక్‌ వంటి 43 రకాల వలస పక్షులను ప్రస్తుతానికి అటవీ సిబ్బంది గుర్తించారు.

వలస పక్షుల సంఖ్య పెరుగుతోంది

ప్రకృతి అనుకూలించడంతో కొల్లేరుకు వచ్చే వలస పక్షుల సంఖ్య పెరుగుతోంది. ఏటా 6 లక్షల విదేశీ పక్షులు వలస వస్తుండగా.. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పక్షుల గణన జరుగుతోంది. పక్షుల ఆవాసాల కోసం అటవీ శాఖ కృత్రిమ స్టాండ్లను ఏర్పాటు చేస్తోంది.

మన దేశంలో వలస పక్షుల సీజన్‌ ఏటా సెప్టెంబర్‌ నెలాఖరు లేదా అక్టోబర్‌ మొదటి వారం నాటికి మొదలవుతుంది. సైబీరియా, రష్యా, టర్కీ, తూర్పు యూరోప్‌ వంటి అత్యంత సుదూర ప్రాంతాలు సహా ఇరవై తొమ్మిది దేశాల నుంచి ఈ పక్షులు వేలాది కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి, ఇక్కడకు అతిథుల్లా వచ్చి వాలతాయి. వీటి రాకపోకల్లో ఏనాడూ క్రమం తప్పదు. మన దేశానికి 1,349 జాతులకు చెందిన లక్షలాది పక్షులు వస్తాయి. వీటిలో 212 పక్షిజాతులు ప్రమాదం అంచున ఉన్నట్లు పర్యావరణవేత్తలు ఇప్పటికే గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories