రైతులు గర్జించారు..టెక్కీలు కదిలారు..!

రైతులు గర్జించారు..టెక్కీలు కదిలారు..!
x
Highlights

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఉద్యమిస్తున్న రైతులకు ప్రజల నుంచి రోజు రోజుకు మద్ధతు పెరుగుతుంది. అన్ని రంగాల్లోనుంచి ప్రజలు...

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఉద్యమిస్తున్న రైతులకు ప్రజల నుంచి రోజు రోజుకు మద్ధతు పెరుగుతుంది. అన్ని రంగాల్లోనుంచి ప్రజలు రైతులకు మద్దతు ఇస్తున్నారు. అయితే కొన్ని రంగాల వారి నుంచీ మంచి సహకారం లభిస్తోంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా రైతులకు అండగా నిలుస్తున్నారు. రైతుల ఆందోళనకు సోషల్ మీడియా ద్వారా అండగా నిలుస్తున్నారు.

అయితే కొంతమంది పని గట్టకుని రైతుల ఉద్యమాలపై సోషల్ మీడియా దుష్ర్పచారం చేస్తున్నారు. దీంతో కొంత మంది సాప్ట్‌వేర్ ఉద్యోగులు వాటి పని పట్టేందుకు కంకణం కట్టుకున్నారు. ఆస్ట్రేలియాలో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూ సెలవుపై పంజాబ్ వచ్చిన భవ్‌జిత్ సింగ్ ఇలాంటి తప్పుడు వార్తాలపై సోషల్ మీడియాలో వార్‌కు తెర తీశారు. ట్రాక్టర్ టు ట్విటర్ హ్యాష్ ట్యాగ్ పేరుతో ట్విటర్ రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. ట్రాక్టర్ టు ట్విటర్ అనే ట్విటర్ హ్యాండిల్‌ను రూపొందించి రైతులకు సంబంధించిన సమాచారాన్ని పోస్టు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

నవంబర్ 28 నుంచి ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది తమ పోస్టులను చూసినట్టు భవ్‌జిత్ సింగ్ తెలిపారు. రైతు ఉద్యమానికి సంబంధించిన వార్తాలు, ఫోటోలు, పోలీసుల దాడులు, వీడియోలు, నినాదాలను హిందీ, ఇంగ్లీష్, పంజాబీలలో పోస్ట్ చేస్తున్నట్టు వెల్లడించారు. తాను ఇక ఆస్ట్రేలియాకు కూడా పోవడం లేదని ప్రకటించారు, సోషల్ మీడియాలో రైతుల ఆందోళనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవడానికే ట్రాక్టర్ టు ట్విటర్ ప్రారంభించినట్టు భవ్ జి‌త్ సింగ్ తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories