IT Department: చిత్రా రామకృష్ణ నివాసంలో ఐటీశాఖ సోదాలు

IT Department Searches At  Chitra Ramakrishna  Residence
x

IT Department: చిత్రా రామకృష్ణ నివాసంలో ఐటీశాఖ సోదాలు

Highlights

IT Department: NSE మాజీ ఎండీ, సీఈవో చిత్ర ఇంట్లో ఐటీ రైడ్స్ కీలకమైన సమాచారాన్ని కొన్ని సంస్థలకు లీక్ చేశారని చిత్రపై ఆరోపణలు.

IT Department: NSE మాజీ సీఈవో చిత్ర రామకృష్ణ నివాసంపై ఐటీ శాఖ అధికారులు రెయిడ్స్ చేశారు. ఇప్పటికే ఆదాయపన్ను సెబీ సంస్థల విచారణలో చిత్రా రామకృష్ణ ఉన్నారు. ఆమె NSE సీఈవో, ఎండీగా ఉన్న సమయంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. దీనికి తోడు అజ్ఞాత యోగితో చిత్ర జరిపిన ఈ-మెయిల్ సంభాషణలు తాజాగా బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.

NSE సలహాదారుగా ఆనంద్‌ సుబ్రమణియన్‌ వివాదాస్పద నియామకం కేసులో చిత్రా రామకృష్ణకు 3 కోట్ల రూపాయలను NSE విధించింది. దీంతో చిత్రా రామకృష్ణ వ్యవహారం ఏమిటనే చర్చ జోరుగా సాగుతోంది. చిత్రా రామకృష్ణ 2013 ఏప్రిల్‌ నుంచి 2016 డిసెంబరు వరకు NSE ఈవో, ఎండీగా పని చేశారు. మరోవైపు సుబ్రమణియన్‌ నియామక వ్యవహారంపై సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంచ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా - సెబీ దర్యాప్తు చేపట్టింది. ఈ వ్యవహారంలో చిత్రా రామకృష్ణ నిర్ణయాలను హిమాలయాల్లోని ఒక యోగి ప్రభావితం చేసినట్టు సెబీ తేల్చింది.

అత్యంత గోప్యంగా ఉంచాల్సిన నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంచ్‌ వివరాలను అన్నింటినీ సదరు యోగికి ఈ-మెయిళ్ల ద్వారా ఆమె చేరవేసేవారని సెబీ బయటపెట్టింది. తాజాగా చిత్ర రామకృష్ణ నివాసంపై ఐటీ శాఖ రెయిడ్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories