ఈ నెల 30 న PSLV-C-53 ప్రయోగం

ISRO to launch PSLV-C53 Mission on June 30
x

ఈ నెల 30 న PSLV-C-53 ప్రయోగం 

Highlights

*షార్ రెండో ప్రయోగ వేదికకు చేరిన వాహక నౌక

ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో PSLV సిరీస్ ప్రయోగాలను వేగవంతం చేస్తోంది. ఈనెల 30న PSLV-C-53 ఉపగ్రహ ప్రయోగానికి ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా షార్ లోని రెండో ప్రయోగ వేదికకు PSLV-C-53 వాహక నౌక చేరింది. వాహన అనుసంధాన భవనంలోని లాంచ్ ఫెడల్ పై అనుసంధానం చేసిన వాహకనౌకను బోగీ సాయంతో కిలోమీటరు దూరంలోని రెండో ప్రయోగ వేదిక వద్దకు తరలించారు. ఈనెల 29వ తేదీన సాయంత్రం 5 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది. ఇది నిరంతరాయంగా 25 గంటల పాటు జరిగిన తరువాత ఈనెల 30 సాయంత్రం ఆరు గంటలకు పీఎస్ఎల్వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories