పీఎస్ఎల్‌వీ సి-49 రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి

పీఎస్ఎల్‌వీ సి-49 రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి
x
Highlights

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరికొన్ని గంటల్లో చేపట్టనున్న పీ ఎస్సెల్వి సి-49 ఉపగ్రహ ప్రయోగానికి సర్వం సన్నద్ధమైంది. కౌంట్‌డౌన్‌ మొదలయింది. గ

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరికొన్ని గంటల్లో చేపట్టనున్న పీ ఎస్సెల్వి సి-49 ఉపగ్రహ ప్రయోగానికి సర్వం సన్నద్ధమైంది. కౌంట్‌డౌన్‌ మొదలయింది. గత మూడు రోజులుగా జరుగుతున్న రిహార్సల్స్‌లో కొద్దిపాటి సాంకేతిక సమస్యలను గుర్తించిన ఇస్రో శాస్త్రవేత్తలు వెను వెంటనే సరిచేశారు. ఆ పై ప్రయోగానికి సంసిద్ధత తెలిపారు. రేపు మధ్యాహ్నం 3.02 గంటలకు సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్-షార్ నుంచి ఈ రాకెట్‌ను నింగిలోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.

పీఎస్సెల్వి సి-49 రాకెట్ ప్రయోగానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన శాస్త్రవేత్తలు కౌంట్ డౌన్ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. నవంబర్ 4న ప్రారంభమైన రిహార్సల్ నవంబర్ 5న ముగిసింది. ఈ సందర్భంగా వాహన నౌకలోని మొదటి దశలో నైట్రోజన్ గ్యాస్ ఫిల్లింగ్ లీకేజీ ఉన్నట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు వెనువెంటనే దాన్ని సరిచే సినట్లు సమాచారం. రిహార్సల్ అనంతరం ప్రీకౌంట్ డౌన్ ప్రారంభమైంది. అది ముగిసిన వెంటనే నవంబర్ 6న మధ్యాహ్నం 1 గంట 2నిమిషాలకు అసలు కొంటిడౌన్ ప్రారంభమయింది. ఇది నిరంతరాయంగా 26 గంటలు కొనసాగిన తర్వాత వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది.

పీఎస్ఎల్వీ మనదేశానికి చెందిన ఈవోఎస్-01తోపాటు, విదేశాలకు చెందిన 9 ఉప్రగహాలను నిర్ణీత కక్ష్యలోకి మోసుకెళ్ల నుంది. ఈ ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం ద్వారా మన దేశానికి చెందిన భూ పరిశీలన ఉపగ్రహంతో వాతావరణ, వ్యవసాయ, అటవీ సంబంధ సమాచారం తెలుసుకోవచ్చు. వాహకనౌకకు 175 కోట్లు, ఉపగ్రహానికి 125 కోట్ల వరకు వ్యయం చేశారు. ఈ ఏడాదిలో షార్ నుంచి ఇదే తొలి ప్రయోగం. కరోనా సవాళ్లను శాస్త్రవేత్తలు అధిగమించి పీఎస్ఎల్వీ సి 49 వాహకనౌక ప్రయోగం చేస్తున్నారు.

కరోనా నేపథ్యంలో చేపడుతున్న ఈ ప్రయోగంలో ఇస్రో యాజమాన్యం పలు మార్గదర్శకాలు పరిగణనలోకి తీసుకుంది. ప్రయోగంలో పాల్గొనే శాస్త్రవేత్తలు, ఉద్యోగులు తదితరులను బబుల్ టీమ్‌గా గుర్తించింది. వీరందరూ గత శనివారం నుంచి షార్‌లోనే ఉన్నారు. ప్రయోగం అయ్యే వరకు వీరిలో ఏ ఒక్కరూ షార్ వదిలి బయటకు వెళ్లకూడదు. అందరూ కుటుంబాలను వదిలి అతిథి భవనాల్లో ఉంటూ విధుల్లో నిమగ్నమయ్యారు. బబుల్ టీమ్‌లో తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ శాస్త్రవేత్తల బృందంతో పాటు, షార్‌లోని వీఏఎల్ఎఫ్, ఎల్ఎస్ఎస్ఎఫ్, రేంజ్ ఆపరేషన్ విజభాగాలకు చెందిన వారూ ఉన్నారు.

రాకెట్ ప్రయోగం అంటే వారం రోజుల నుంచే షార్‌లో శాస్త్రవేత్తల సందడి కనిపించేది. కరోనా నేప థ్యంలో ప్రస్తుతం నిశబ్దం నెలకొంది. దేశంలోని వివిధ ఇస్రో కేంద్రాల నుంచి శాస్త్రవేత్తలు వచ్చేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యమైన వారు మాత్రమే షార్‌లో ఉన్నారు. అసలు రాకెట్ ప్రయోగం సందడి కాన రాలేదు. కోవిడ్- 19 నేపథ్యంలో ఈసారి రాకెట్ ప్రయోగానికి మీడియా అనుమతులు సైతం నిరాకరించారు. బబుల్ టీం మినహా మిగతా వారు ఎవరిని ప్రయోగ పరిసర ప్రాంతాలకు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో ప్రయోగ సమయంలో సందడిగా కనిపించే షార్ ఈ సారి నిర్మానుష్యంగా కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories