ISRO: మరికొద్ది గంటల్లో నింగిలోకి జీశాట్ ఎన్‌2

ISRO to Launch Advanced Communication Satellite GSAT N2
x

ISRO: మరికొద్ది గంటల్లో నింగిలోకి జీశాట్ ఎన్‌2

Highlights

GSAT N2 Satellite: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో సరికొత్త విధానానికి తెరలేపింది.

GSAT N2 Satellite: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో సరికొత్త విధానానికి తెరలేపింది. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఓవైపు స్వయం సమృద్ధి లో దూసుకెళుతూనే మరోవైపు టెక్నాలజీ విభాగాలతో ప్రైవేటు భాగస్వామ్యానికి దారులు వేస్తోంది. అంతరిక్ష ప్రయోగాలలో మరో ప్రైవేట్ సంస్థ స్పేస్‌ఎక్స్‌తో ఇస్రో జోడీ కట్టింది.

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రూపొందించిన జీశాట్ మరికొద్ది గంటల్లో నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇటీవల వరుస విజయాలతో రోదసీలోకి దూసుకెళుతున్న ఇస్రో.. తొలిసారిగా ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ సాయం తీసుకోనుంది. స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌- 9 రాకెట్‌ సహాయంతో భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెడుతోంది.

ఇటీవల ఇస్రో పలు దేశాలకు చెందిన రాకెట్లను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెడుతూ.. భారీగానే ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది. తాజాగా భారత్‌కు చెందిన శాటిలైట్‌ని అంతరిక్షంలోకి స్పేస్‌ఎక్స్‌ కంపెనీని సహాయం కోరుతుంది. ఇస్రో భారీ ఉపగ్రహాలను మార్క్‌-3 ద్వారా నింగిలోకి తీసుకెళ్తుంది. మార్క్‌-3 రాకెట్‌ 4వేల కిలోల బరువున్న ఉపగ్రహాలను మాత్రమే భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టే సామర్థ్యంతో ఉంటుంది. అయితే జీశాట్‌ ఎన్‌2 బరువు 4700 కిలోల బరువు ఉంటుంది. ఈ క్రమంలోనే స్పేస్‌ఎక్స్‌ సహాయం తీసుకుంటోంది ఇస్రో.

సాంకేతికపరంగా ప్రైవేటు భాగస్వామి స్పేస్ఎక్స్‌ ఫాల్కన్-9 రాకెట్ జీశాట్-ఎన్2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తుంది. స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ని ఉపయోగించుకొని ఇస్రో చేపడుతున్న తొలి వాణిజ్యపరమైన ఉపగ్రహ ప్రయోగం జీశాట్. ఇది శాటిలైట్ విమానాల్లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఉపయోగపడుతుంది. మరోవైపు ఈ ప్రయోగం ద్వారా భారత్‌లోని మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్‌ని విస్తరించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories