ఈ ఏడాది తొలి ప్రయోగానికి రెడీ అయిన ఇస్రో

ISRO ready for first launch this year
x

ఈ ఏడాది తొలి ప్రయోగానికి రెడీ అయిన ఇస్రో 

Highlights

ISRO: 14న పీఎస్ఎల్‌వీ సీ-52 వాహక నౌక ప్రయోగం. 13న కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభం.

ISRO: ఈ ఏడాది తొలిదశ ప్రయోగానికి ఇస్రో సిద్ధం..భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి.. ఈ ఏడాది తొలి ప్రయోగానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. వాతావరణం అనుకూలిస్తే.. ఈనెల 14న ఉదయం 5.59 గంటలకు రాకెట్ దూసుకెళ్లనుంది. మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-52 వాహక నౌకను ప్రయోగించనున్నారు. వాహకనౌకలో 4 దశల అనుసంధానం పూర్తి చేసి.. శిఖర భాగాన ఉష్ణకవచం చేపట్టనున్నారు. ప్రయోగానికి ముందు నిర్వహించే కౌంట్‌డౌన్ ప్రక్రియ ఈనెల 13న వేకువజామున 4.29 గంటలకు ప్రారంభమవుతుంది. నిరంతరాయంగా 25.30 గంటల పాటు కౌంట్‌డౌన్‌ కొనసాగిన తర్వాత వాహననౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఐఆర్‌శాట్-1-ఏతో పాటు ఐఎన్‌ఎస్‌-2-టి.డి, విద్యార్థులు రూపకల్పన చేసిన ఇన్‌స్పైర్‌శాట్-1 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ సీ-52 మోసుకెళ్లనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories