ISRO: GSLV మార్క్- 3 ప్రయోగానికి ఏర్పాట్లు

ISRO GSLV Mk 3 Rocket Launch Updates | Telugu News
x

ISRO: GSLV మార్క్- 3 ప్రయోగానికి ఏర్పాట్లు

Highlights

ISRO: ఈనెల 23న GSLV మార్క్- 3 రాకెట్‌ ప్రయోగం

ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న GSLV మార్క్ - 3 ప్రయోగానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 22న GSLV మార్క్- 3ను రోదసిలోకి పంపాలని ముందుగా నిర్ణయించిన ఇస్రో కొద్ది మార్పులు చేసింది. ఒక్కరోజు ఆలస్యంగా ఈనెల 23న GSLV మార్క్ - 3 రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఇందుకోసం ప్రయోగ సన్నాహకాలను వేగవంతం చేసింది.

తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 22న తలపెట్టిన GSLV మార్క్- 3 వాహకనౌక ప్రయోగం ఒకరోజు వాయిదా వేశారు. వాహకనౌక అనుసంధాన కార్యక్రమాలు రెండో ప్రయోగవేదిక సమీపంలోని వ్యాబ్‌లో జరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని పనులు పూర్తయ్యాయి. ఎల్-110లో సాంకేతిక లోపం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించినట్లు సమాచారం. దీన్ని సరిచేసేందుకు కొంత సమయం అవసరం కావడంతో ప్రయోగ తేదీని ఒక రోజు పొడిగించారు. ఈ నెల 23న ప్రయోగం చేసేలా శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.

GSLV మార్క్ - 3 వాహకనౌక ద్వారా వన్ వెబ్‌కు చెందిన, ఒక్కోటి 142 కిలోల బరువున్న 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. శ్రీహరికోట నుంచి మొదటిసారిగా అత్యంత భారీ పేలోడ్స్ ను మోసుకెళ్లనుండటంతో శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న GSLV మార్క్- 3 ప్రయోగం నేపథ్యంలో రాకెట్ కేంద్రం షార్‌లో హడావిడి మొదలైంది. అన్ని విభాగాల యంత్రాంగం అప్రమత్తమైంది. షార్ సమీపంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రయోగ సన్నాహకాలు నిర్విరామంగా కొనసాగుతూ ఉన్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories