Coronavirus: దేశంలో మళ్లీ లాక్ డౌన్ తప్పదా? మే 2న...

Is Nation Wide Lockdown After May 2nd?
x

Coronavirus: దేశంలో మళ్లీ లాక్ డౌన్ తప్పదా? మే 2న...

Highlights

Coronavirus: కరోనా ఉద్ధృతితో దేశంలో మళ్లీ లాక్ డౌన్ పెట్టబోతున్నారా ? గతేడాది తరహాలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తారా లేదా పాక్షిక లాక్ డౌన్ విధిస్తారా ?

Coronavirus: కరోనా ఉద్ధృతితో దేశంలో మళ్లీ లాక్ డౌన్ పెట్టబోతున్నారా ? గతేడాది తరహాలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తారా లేదా పాక్షిక లాక్ డౌన్ విధిస్తారా ? వైరస్ కట్టడికి ఏకైక మార్గం లాక్ డౌన్ యేనా ? ఇప్పటికే దీనిపై కసరత్తు మొదలైందా ? కేంద్రం తీరు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది.

కరోనా విజృంభణతో దేశవ్యాప్తంగా పూర్తి లేదా పాక్షిక లాక్ డౌన్ విధించే సూచనలు కనిపిస్తున్నాయి. మే 2 తర్వాత దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సీఎంలు, ఉన్నతాధికారులతో ప్రధాని మోడీ వరుస సమావేశాలు లాక్ డౌన్ కోసమేనన్న అనుమానాలకు బలమిస్తున్నాయి.

కరోనా కట్టడికి జార్ఖండ్ లో వారం రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. మహారాష్ట్రతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాలు ఇప్పటికే పాక్షిక లౌక్ డౌన్ ను పాటిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే, తెలంగాణ, ఏపీలో నైట్ కర్ఫ్యూ విధించారు. కేరళ, కర్ణాటకలో అలర్ట్ ప్రకటించారు. పలు రాష్ట్రాల్లో గ్రామాలు స్వచ్ఛంద లాక్ డౌన్ పాటిస్తున్నాయి.

మే 2న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే కేంద్ర మంత్రివర్గం సమావేశంకానుంది. దేశంలోని కరోనా పరిస్థితులపై చర్చించనుంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా సంపూర్ణ లేదా పాక్షిక లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మే, జూన్ నెలలో ఒక్కొక్క పేద కుటుంబానికి ఐదు కిలోల చొప్పున సుమారు 80 కోట్ల మంది పేదలకు బియ్యం, గోధుమలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా ఇవ్వనున్నట్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదంతా దేశంలో లాక్‌ డౌన్‌ కోసమేనని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ లాక్ డౌన్ విధిస్తే ప్రభుత్వాలపై ఆర్ధిక భారం పడకుండా చర్యలు ఉండనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories