మౌలానా సాద్ నిజంగానే కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారా ?

మౌలానా సాద్ నిజంగానే కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారా ?
x
Highlights

సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. న్యూస్ లెటర్ అనే ఆంగ్ల పత్రికలో వచ్చినట్లు సోషల్ మీడియాలో ఇది చక్కర్లు కొడుతోంది. పీఎం కేర్స్ ఫండ్ కు తబ్లిగీ...

సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. న్యూస్ లెటర్ అనే ఆంగ్ల పత్రికలో వచ్చినట్లు సోషల్ మీడియాలో ఇది చక్కర్లు కొడుతోంది. పీఎం కేర్స్ ఫండ్ కు తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ ఒక కోటి రూపాయల విరాళం ఇచ్చారనే విషయం అందులో ఉంది. ఈ వైరల్ పోస్ట్ కు న్యూస్ లెటర్ ఫ్రంట్ పేజ్ కూడా జత చేశారు. మార్చి 28న పీఎం కేర్స్ ఫండ్ కు మౌలానా సాద్ కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారనేది దాని హెడ్డింగ్. అసలు ప్రభుత్వానికి చిక్కకుండా పారిపోయిన మౌలానా సాద్ కోటి రూపాయలు ఎలా ఇచ్చారంటూ సందేహాలు ఉన్నాయి. దీనిపై ఓ హిందీ చానల్ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. అవేంటో చూద్దాం.

మతం, విశ్వాసం, కులం అనేది ఏదీ లేకుండా ఇప్పుడు భారతదేశం మొత్తం తబ్లిగీ జమాత్ చేసిన నిర్వాకాన్ని ఎండగడుతోంది. మౌలానా సాద్ చేసిన ప్రసంగం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలు ఏకకంఠంతో ఖండిస్తున్నాయి. తబ్లిగీ జమాత్ నిర్వాకంతో దేశంలో కరోనా కు చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. క్వారంటైన్ లోకి వెళ్లాల్సిన వారి సంఖ్య అధికమైపోయింది. ఇదే విషయంలో ది ప్రింట్ ప్రచురించిన ఓ కథనం ఇప్పడు సంచలనంగా మారింది. అదేంటో చూద్దాం.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories