మృగాళ్లందరినీ పట్టుకుని చివరికి ఉరికంబం ఎక్కించిన ఛాయాశర్మ

మృగాళ్లందరినీ పట్టుకుని చివరికి ఉరికంబం ఎక్కించిన ఛాయాశర్మ
x
Highlights

తాళ్లు సిద్ధంగా ఉన్నాయ్.. పోల్స్ రెడీ అయ్యాయ్.. డెడ్‌బాడీలను తీసుకెళ్లే వాహనాలు వచ్చేశాయ్.. మరో రెండు వారాల్లో శిక్ష అమలు చేయడమే మిగిలింది. నిర్భయ...

తాళ్లు సిద్ధంగా ఉన్నాయ్.. పోల్స్ రెడీ అయ్యాయ్.. డెడ్‌బాడీలను తీసుకెళ్లే వాహనాలు వచ్చేశాయ్.. మరో రెండు వారాల్లో శిక్ష అమలు చేయడమే మిగిలింది. నిర్భయ కేసులో తాజా పరిణామాలివి. నలుగురు దోషులకు ఒకేసారి ఉరిశిక్ష పడటంతో కీలక పాత్ర పోషించింది పోలీస్‌ అధికారి ఛాయాశర్మ. ఏడేళ్ల క్రితం బ్లైండ్‌ కేసుగా కనిపించిన నిర్భయ ఘటనలో నిందితులను పట్టుకునేందుకు చాలా శ్రమించారు. చివరకు నేరస్తులను కోర్టుమెట్లు ఎక్కించడంతో పాటు ఉరిశిక్షపడేలా గట్టి సాక్షాలను సంపాధించిన పోలీస్‌ అధికారిని పలువురు అభినందిస్తున్నారు.

దేశ రాజధానిలో జరిగిన ఆ కర్కశ సంఘటనతో ప్రతి ఒక్క భారతీయుడు కన్నీరు కార్చాడు. కోట్లాది హృదయాలు ఆక్రోశించాయి. దేశం యావత్తు ఆగ్రహాంతో ఊగిపోయింది. నిర్భయకు జరిగిన అన్యాయంపై అందరి గుండె పగిలింది. ప్రపంచాన్ని నిశేఛష్టులను చేసిన నిర్భయ కేసులో వెలువడిన తీర్పుపై సర్వత్రా హర్షాతీరేకాలు వ్యక్తం అవుతున్న వేళ ఈ కేసులో కీలక భూమిక పోషించిన పోలీస్‌ అధికారి ఛాయాశర్మను అంతా మెచ్చుకుంటున్నారు.

ఏడేళ్ల క్రితం యావత్‌ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటన, తన కెరీర్‌లోనే ఓ ఛాలెంజ్‌ కేసుగా చెబుకుంటున్నారు ఛాయాశర్మ. నిర్భయకేసును చూసినప్పుడు ఇదో ఆధారాలు లేని బ్లైండ్‌ కేసుగా అనిపించడమేకాక ఎలా ఛేదించాలో అర్థం కాలేదాంటారు. ప్రత్యేక టీంతో కేసు విచారణ చేసిన ఆమె ఎట్టకేలకు మృగాళ్లందరినీ పట్టుకుని చివరికి ఉరి కంభం ఎక్కించేవరకు ఆమె ఎదుర్కొన్న సవాళ్లెన్నో.

తనను ఇలా చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టవద్దని నిర్భయ చెప్పి మాటాలే కేసును మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు తనలో పట్టుదలను పెంచిందంటారు పోలీస్‌ అధికారిణి ఛాయా శర్మ. నిస్సహాయ స్థితిలో, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ యువతి మాటలు వెంటాడటంతో పాటు ఆమె గుండెల్లో ఎంతోకాలం మార్మోగుతూనే ఉన్నాయన్నారు. ఓ వైపు జరిగిన దారుణం గుండెలు పిండేస్తుంటే మరోవైపు అకృత్యానికి గురైన నిర్భయ ధైర్యం ఆశ్చర్యం గొలుపుతుంటే పట్టుదలగా ముందడుగు వేశానంటారు. ఆమె మాత్రం అత్యంత దారుణ స్ధితిలో కూడా నిర్భయలో కనిపించిన స్థైర్యమే తనకు స్ఫూర్తి, బలం అయిందని చెబుతారు.

నిర్భయ కేసు తన కెరీర్‌లో మర్చిపోలేని సంఘటన అని చెప్పే ఛాయాశర్మ ఆ కేసు చిక్కుముడి వీడేందుకు నిర్భయ వాంగ్మూలమే చాలా హెల్ప్‌ చేసిందంటారు. సామూహిక అత్యాచారానికి గురై, ఒళ్లంతా గాయాలతో ప్రాణాపాయస్థితిలో ఉండి కూడా ఆ అమ్మాయి ప్రదర్శించిన ధైర్యం మాటల్లో చెప్పలేనిదని, నిజంగా ఆ అమ్మాయి 'నిర్భయే'అనీ అంటోంది. చనిపోతానని తెలిసి కూడా అంత బాధలోనూ నిర్భయ ధైర్యాన్ని ప్రదర్శించి తనకు తెలిసిన వివరాలన్నింటినీ పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పిందని వాటి ఆధారంగానే నిందితులను పట్టుకున్నామని అంటారు. నిర్భయ కేసులో ఆలస్యం జరిగినా, న్యాయమైన తీర్పు వచ్చింది. దేశవ్యాప్తంగా నిర్భయ కోసం ఎందరో పోరాడారు. నిందితులకు ఉరిపడటంతో నిర్భయ ఆత్మ శాంతికి కలుగుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories