ఈ దీపావ‌ళికి మీ కూతురి పేరుపై పెట్టుబ‌డి పెట్టండి.. మంచి రాబ‌డి పొందండి..

Invest in Sukanya Samriddhi Yojana Scheme in your Daughter
x

సుకన్య సంవృద్ధి యోజన (ఫైల్ ఇమేజ్)

Highlights

* కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల కోసం ఈ ఖాతాను తెరవవచ్చు.

Sukanya Samriddhi Yojana Interest Rate Invest: దీపావళికి మీ కుమార్తెకు బహుమతి ఇవ్వాలనుకుంటే మీరు ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్టండి. భవిష్య‌త్‌లో మంచి లాభాలు పొందండి. ఇందుకోసం మీరు పోస్టాఫీసులో సుకన్య సమృద్ధి యోజన ప‌థ‌కంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో ఖచ్చితంగా మంచి రాబడిని పొందుతారు. అలాగే మీ డబ్బు కూడా సురక్షితంగా ఉంటుంది. ఈ పథకం గురించి మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకుందాం.

1. వడ్డీ రేటు

సుకన్య సమృద్ధి యోజనలో సంవత్సరానికి 7.6 శాతం వడ్డీ రేటు ఉంటుంది. వడ్డీ వార్షిక ప్రాతిపదికన లెక్కిస్తారు.

2. పెట్టుబడి మొత్తం

ఈ పోస్టాఫీసు పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250, గరిష్టంగా రూ. 1.5 లక్షల పెట్టుబడి పెట్టవచ్చు.

3. ఎవరు ఖాతా తెరవగలరు?

ఈ పథకం కింద ఆమె సంరక్షకుడు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్ల పేరు మీద పెట్టుబడి పెట్టవచ్చు. పిల్లల పేరిట బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఒక ఖాతా మాత్రమే తెరిచే అవ‌కాశం ఉంటుంది. కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల కోసం ఈ ఖాతాను తెరవవచ్చు. కవలలు లేదా ముగ్గురు పిల్లలు ఒకేసారి పుట్టినట్లయితే రెండు కంటే ఎక్కువ ఖాతాలను తెరిచే అవ‌కాశం ఉంటుంది.

నిబంధ‌న‌లు..

1. ఖాతా తెరిచిన తేదీ నుంచి 21 సంవత్సరాల తర్వాత ఖాతాను మూసివేయవచ్చు.

2. ఇది కాకుండా 18 సంవత్సరాల వయస్సులోపు ఆడపిల్లకు వివాహం జరిగిన సందర్భంలో ఖాతాను మూసివేయవచ్చు.

3. ఈ పథకంలో డిపాజిట్ చేసిన మొత్తానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపు ఉంటుంది.

4. ఖాతా తెరిచిన తేదీ నుంచి గరిష్టంగా 15 సంవత్సరాల వరకు పథకంలో డిపాజిట్లు చేయవచ్చు.

5. ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో కనీస మొత్తం రూ. 250 జమ చేయకపోతే ఆ ఖాతా డిఫాల్ట్ ఖాతాగా పరిగణిస్తారు.

6. డిఫాల్ట్ అయిన ఖాతాను తెరిచిన తేదీ నుంచి 15 సంవత్సరాలు పూర్తి కాకుండానే పునరుద్ధరించవచ్చు. ఇందుకోసం డిఫాల్ట్ అయిన ప్రతి సంవత్సరానికి కనీసం రూ.250తో పాటు రూ.50 డిఫాల్ట్ చెల్లించాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories