International Women's Day 2021: సృష్టికి మూలం మహిళ..ఉమెన్స్ డే స్పెషల్

International Womens Day
x
WomensDay(Thehansindia)
Highlights

International Women's Day Special: వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది.

International Women's Day Special: అవనిలో సగం.. ఆకాశంలో సగం.. అంతెందుకు ఈ సమస్త సృష్టికి మూలం మహిళ.! ఒకప్పుడు వంటింటికి మాత్రమే పరిమితం అనే భావన నుంచి.. ఇప్పుడు పరిమితులు లేని విశ్వ వ్యాప్తమైంది ఆమె.! గల్లీ నుంచి గగనయానం వరకూ ఆమె సాధించని ఘనతే లేదు. అలాంటి మహిళలకు సెల్యూట్ చేస్తూ.. ఉమెన్స్ డే ప్రత్యేకం.

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా

యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రఫలా: క్రియా:''

ఎక్కడ మహిళను గౌరవిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారు. ఎక్కడ స్త్రీలను గౌరవించరో ఎంత గొప్ప సత్కార్యాలైననూ ఫలించవు అని మన సంస్కృతి తెలపబడింది. ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళల దినోత్సవం జరుపుకుంటారు. ఆరోజే ఉమెన్స్ డే ఎందుకు జరుపుతారు. అయితే నిజంగా సమాజంలో మహిళలను గౌరవింపబడతున్నారా? ఉమెన్స్ డే రోజు చెప్పే శుభాకాంక్షలే సంఘంలో మహిళల గౌరవానికి గుర్తింపా?అసలు మహిళాలోకం ఏం కోరుకుంటుంది.

అంతర్జాతీయ ఉమెన్స్ డే గురించి:

సామాజికంగాను, రాజకీయాల్లోనూ, ఆర్థిక రంగంలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకుని, వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి, ప్రతి ఏటా నిర్వహిస్తోంది. దీని పుట్టుకకు బీజాలు 1908లో పడ్డాయి. తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే ఒక మహిళది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాల్లో నిర్వహించారు. అయితే, 1975వ సంవత్సరంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించటం ప్రారంభించింది. 1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ''ఆహారం - శాంతి'' డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ జా 2 సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 ఆదివారం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి. సాంకేతికంగా చెప్పాలంటే.. ఈ ఏడాది జరిగేది 109 అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

ఇతర దేశాల్లో ఇలా జరుపుకుంటారు?

చాలా దేశాల్లో అంతర్జాతీయ మహిళల దినోత్సవం జాతీయ సెలవు దినంగా ఉంటుంది. రష్యాలో మార్చి 8కి ముందు, తర్వాత మూడు నాలుగు రోజుల పాటు పువ్వుల కొనుగోళ్లు రెండింతలు అవుతుంటాయి. చైనాలో మార్చి 8వ తేదీన స్టేట్ కౌన్సిల్ సిఫార్సు మేరకు సెలవు లభిస్తుంది. ఇటలీలో 'ల ఫెస్టా డెల్ల డొన్న'ను మిమోసా అనే చెట్టుకు కాసే పువ్వులను బహూకరించి జరుపుకుంటారు. అమెరికాలో అయితే మహిళల దినోత్సవం రోజు వారిని గౌరవిస్తూ అధ్యక్ష ప్రకటన వెలువడుతుంది.

మహిళలపై వివక్ష

ఈతరం మహిళాలోకం ఉన్నత శిఖరాలను చేరుకుని పురుషులకు తామేమి తీసిపోమని చాటిచెపుతోంది. ఇంటికే పరిమితం కాదంటూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇంతా సాధిస్తున్న మహిళలు ఇంకా నిత్యం అణచివేతకు గురవుతూనే ఉన్నారు. అయితే మహిళలు అన్ని రంగాల్లో ముందున్నా సమానత్వం పూర్తిగా లభించలేదు. మరోవైపు చట్టసభల్లో సమానాత్వం అంటూ అన్ని పేరుకే అనే చందంగా వ్యవస్థలు సాగుతోంది. నిత్యం ఎక్కడో ఒకచోట మహిళలపై అత్యాచారాలు జరుగుతునే ఉన్నాయి. స్ర్త్రీలు దేశంలో అణచివేతకు గురవుతూనే ఉన్నారు. అసలు ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థలు మహిళలను రక్షణకు చట్టాలు మరింత కఠినతరం చేయాలి. అలాగే సమాజంలో మహిళల పట్ల ఆలోచించే విధానంలో మార్పులు రావాలి. అలా జరిగినప్పుడే స్త్రీలు సంఘంలో గౌవరం పొందుతారు. స్త్రీల పట్ల మగవారు ఆలోచించే ధోరణి మారాలి, అంగడి బొమ్మగా కాదు వారిలో అమ్మను చూడగలగాలి. సంఘంలో ఎక్కడికి వెళ్లినా గౌరవింపబడాలి. అప్పుడే, ఆక్షణమే మహిళా సాధికారికత సాధ్యమవుతుంది. అదే యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా...

Show Full Article
Print Article
Next Story
More Stories