*ఇప్పటికే ఫిలిప్పైన్స్‌కు ఆయుధాలను అందిస్తున్న భారత్
India Vs China: శత్రువు శత్రువు మిత్రుడు ఈ ఫార్మలాను భాగా వంటబట్టించుకున్నది డ్రాగన్ కంట్రీ ఐరోపా దేశాలతో రష్యాకు అండగా నిలబడుతోంది. భారత్ ఘర్షణల్లో పాక్‌కు సహాయమందిస్తోంది. ఇలా రోజు రోజుకు సరిహద్దులో రెచ్చిపోతున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ కూడా అదే ఫార్ములాను అనుసరిస్తోంది. దక్షిణ చైనా సముద్రంపై భారత్ కన్నేసింది. ఒకే దెబ్బతో అటు బీజింగ్‌కు చెక్ పెట్టడమే కాకుండా రక్షణ రంగం వ్యాపారానికి తలుపులు తెరుస్తోంది. చైనా ముప్పును ఎదుర్కొంటున్న దేశాలకు సాయంగా నిలబడుతోంది. దక్షిణ చైనా సముద్రంలోనే బ్రహ్మోస్ వంటి సూపర్ సోనిక్ మిస్సైళ్లను భారత్ రంగంలోకి దించుతోంది. డ్రాగన్ తోక కత్తిరేంచేందుకు భారీ అస్త్రాలను ఇండికా ఎక్కుపెడుతోంది.
దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ ఆధిపత్యం సాగిస్తోంది. నిత్యం సైనిక విన్యాసాలతో ఆరు ద్వీప దేశాలను భయపెడుతోంది. మిస్చీఫ్ రీఫ్, స్కార్బొరోఫ్ సోల్ ద్వీపాల్లో సైనిక స్థారవాలను ఏర్పాటు చేసి ఆయుధాలు, జావలిన్లు, ఫైటర్ జెట్లు, లేజర్ ఆయుధాలు, సైన్యంతో పూర్తిగా చైనా నింపేసింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ దక్షిణ చైనా సుముద్రంలో నెలకొన్నది. ఒకవైపు చైనా ఉంటే మరోవైపు బ్రూనై, తైవాన్, మలేషియా, వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ దేశాలు ఉన్నాయి. డ్రాగన్ కంట్రీ నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. బీజింగ్‌తో పోలిస్తే ఈ దేశాల వద్ద ఆయుధాలు, సైన్యం చాలా తక్కువ. శత్రువు శత్రువు మిత్రుడు అన్న చైనా ఫార్ములాను దక్షిణాసియా దేశాల్లో భారత్ అమలుచేస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోకి ఆయుధాలతో భారత్ ఎంట్రీ ఇచ్చింది. దక్షిణ ఆసియా దేశాలకు అండగా నిలుస్తోంది. తమను తాము రక్షించుకునేందుకు ఆయా దేశాలకు భారత్ సహాయం అందిస్తోంది.
ఈ ఏడాది జనవరిలో క్షిపణులు విక్రయంపై భారత్‌తో ఫిలిప్పైన్ ఒప్పందం కుదుర్చుకున్నది. ఇప్పుడు వియత్నాంతో కూడా భారత్ పలు ఒప్పందాలను కుదుర్చుకుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మూడ్రోజుల పర్యటనలో చివరి రోజు 12 హైస్పీడ్ బోట్లను వియత్నాంకు అందించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ బోట్లను వియత్నాం తీర ప్రాంత గస్తీకి వినియోగించనున్నది. వీటిలో 7 బోట్లు ఇండియాలో, 5 వియత్నాంలో తయారీకి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంతేకాకుండా బ్రహ్మోస్ క్షిపణులపైనా వియత్నాం ఆసక్తి చూపుతోంది. అందుకు సంబంధించిన నిధులను సమకూర్చేందుకు కూడా భారత్ అంగీకరించింది. భారత్ నుంచి ఆకాశ్ వంటి ఆయుధాలను కొనుగోలు చేసేందుకు కూడా వియత్నాం సిద్ధమైంది. ఈ మిస్సైల్ నేలపై నుంచి 25 కిలోమీటర్ల పరిధిలో నింగిలోని లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. 2014 తయారైన ఈ మిస్సైళ్లు 2015లో ఆర్మీకి అందాయి. సోవియట్ కాలం నాటి మిస్సైల్ స్థానంలో ఆకాశ్‌ను వియత్నాం దిగుమతికి యోచిస్తోంది.
ఇక వియత్నాంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను కూడా భారత్ కుదుర్చుకుంది. చమురు అన్వేషణకు భారతీయ కంపెనీలు రంగంలోకి దిగనున్నాయి. ఫిలిప్పైన్ తరువాత వియత్నాంతో పాటు ఇతర నాలుగు దేశాలు కూడా భారత్ వైపు చూస్తున్నాయి. సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు యత్నిస్తున్నాయి. దక్షిణాసియా దేశాలకు ఆయుధాలను అందించేందుకు భారత్ కూడా ఆసక్తి చూపుతోంది. చైనాను దారికి తీసుకురావాలంటే.. ఇదే సరైన మార్గమని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ఆయా దేశాల్లో భారత్ ఆయుధాలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో మేజర్ మిలటరీ ఎగుమతికి భారత్ సిద్ధమైంది. ఫిలిప్పైన్ కు బ్రహ్మోస్ క్షిపణులను అందిస్తోంది. ఫిలిప్పైన్ ప్రభుత్వం మూడు బ్రహ్మోస్ బ్యాటరీలను కొనుగోలు చేస్తోంది. ఒక్కో బ్యాటరీలో.. రెండు మిస్సైల్ లాంచర్లు, రాడర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి. ఈ వ్యవస్థ రెండు బ్రహ్మోస్ మిస్సైళ్లను 10 సెకండ్ల వ్యవధిలో ప్రయోగించవచ్చు. 37 కోట్ల డాలర్లకు ఈ మూడు బ్యాటరీలను భారత్ విక్రయిస్తోంది.
సూపర్ సోనిక్ మిస్సైల్ బ్రహ్మోస్‌ను నింగి, నేల, నీటి నుంచి ప్రయోగించే అవకాశం ఉంది. 290 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను 100 శాతం కచ్చితత్వంతో దాడి చేయగలదు. ఈ క్షిపణితో దక్షిణ చైనా సముద్రంలోని చైనా సైనిక స్థావరం మిస్చీఫ్ రీఫ్‌ను ధ్వంసం చేయగలదు. ఈ నేవల్ బేస్‌లో చైనా భారీగా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్నులను మోహరించినట్టు తెలుస్తోంది. వాటిని బ్రహ్మోస్ దీటుగా ఎదుర్కొనగలదు. అంతేకాకుండా ఫిలిప్పైన్స్ సమీపంలోని స్కార్బొరోఫ్ సోల్ సైనిక స్థావరంపైనా గురి పెట్టవచ్చు. వియత్నాం కూడా వాటినే కోరుకుంటోంది. వియత్నాంతో డీల్ కుదిరితే భారత్‌కు ఇది రెండోది అవుతుంది. మిగతా దక్షిణ చైనా సముద్ర దేశాలైనా సింగపూర్, బ్రూనై, మలేషియా, తైవాన్ కూడా ఇదే దారి పట్టనున్నాయి. ఇప్పటికే తైవాన్‌కు చైనా నుంచి ముప్పు పొంచి ఉంది. అయితే ఆ దేశానికి అమెరికా అండగా ఉంటోంది. తైవాన్‌పై దాడి చేస్తే తమ సైన్యం రంగంలోకి దిగుతుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరించారు.
దక్షిణాసియా దేశాలతో సంబంధాలను మెరుగుపర్చుకోవడంతో భారత్‌కు అనేక లక్ష్యాలు నెరవేరుతాయి. మేక్ ఇన్ ఇండియాతో రక్షణ రంగానికి కొత్త ఊపు రావడంతో పాటు ప్రపంచ ఆయుధ రంగంలో భారత్ ప్రాధాన్యం పెరగనున్నది. భారత్ ఆయుధ దిగమతులు చేసుకునే దేశమే కాదు ఆయుధాలను ఎగుమతి కూడా చేయగలదని నిరూపించుకోనున్నది. అదే సమయంలో చైనాకు చెక్ పెట్టేందుకు ఇది మరింతగా ఉపయోగపడనున్నది. భారత్‌పై ఆయుధాలను గురిపెడుతున్న డ్రాగన్‌కు దక్షిణ సముద్రం నుంచే చెక్ పెట్టేందుకు మోడీ ప్రభుత్వం పావులు కదుపుతోంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire