Kamala Harris: ఇండియాలో కోవిడ్ పరిస్థితి దారుణం కమలా హారిస్ ఆవేదన

Indias Covid Situation Tragic Says US Vice President Kamala Harris
x

Kamala Harris:(File Image)

Highlights

Kamala Harris: ఇండియాలో కోవిడ్ పరిస్థితి దారుణంగా ఉందని మరింత సాయం అందిస్తామని కమలా హారిస్ అన్నారు.

Kamala Harris: కరోనా మహమ్మారి విజృంభణతో భారత్ లో నెలకొన్న పరిస్థితుల పట్ల అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియాలో కోవిడ్ పరిస్థితి దారుణంగా ఉందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. ఈ సవాలును ఎదుర్కోవడానికి, ఆ దేశానికి సాయం చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని ఆమె చెప్పారు. ఇది గ్రేట్ ట్రాజెడీ అనడానికి సందేహం లేదని, ఎంతో ప్రాణ నష్టం జరుగుతోందని అన్నారు. గతంలోనే కాక, ఇప్పుడు కూడా చెబుతున్నానని, భారత దేశానికి అండగా ఉంటామని అంటున్నానని పేర్కొన్నారు. ఇండియాకు రూపాల్లో సాయం చేస్తున్నాం.. అక్కడ జరుగుతున్న విషాదాలపై చింతిస్తున్నాం అని ఆమె చెప్పారు. ఓహియోలో మీడియాతో మాట్లాడిన కమలా హారిస్.. బ్యాన్ దృష్ట్యా ఇండియాలోని తమ కుటుంబంతో మాట్లాడలేదని తెలిపారు.

భారత్ నుంచి వచ్చే ప్రయాణాలపై వచ్చే వారం నుంచి అమెరికా ఆంక్షలు విధించనుందన్న ప్రతిపాదనపై మాట్లాడేందుకు హారిస్ .నిరాకరించారు, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉందన్నారు. ఇండియాలోని అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి వెల్లడించిన విషయం తెలిసిందే. ఇలాఉండగా నిన్న ఒక్కరోజే 4 లక్షల కోవిద్ కేసులతో ఇండియా ప్రపంచం లోనే తొలి కోవిద్ ఇంఫెక్టెడ్ దేశంగా మారింది. నిన్న 3,464 మంది కరోనా మరణించారు.

మహారాష్ట్రలో 62,919 కేసులు, కర్ణాటకలో 48,296, కేరళలో 37,199 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 375, యూపీలో 332 మంది రోగులు మృతి చెందారు. దేశంలో మరణించిన వారి సంఖ్య మొత్తం 2,11,778 కి చేరుకుంది. అయితే నిన్న లక్షా 56 వేల మందికి పైగా కోలుకున్నారు. దేశంలో ఆక్సిజన్,హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత ఇంకా కొనసాగుతోంది. అమెరికా తదితర దేశాల నుంచి వచ్చిన సాయాన్ని వినియోగించుకునేందుకు సమాయత్తమవుతోంది. అమెరికా నుంచి నిన్న మరో రెండు విమానాలు ఒక్సుగేం సిలిండర్లు తదితర వైద్య పరికరాలతో ఇండియాకు బయలుదేరాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories