రేపే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం

India’s Covid-19 vaccination drive begins tomorrow
x
Highlights

దేశ వ్యాప్తంగా రేపటి నుంచి కరోనా వ్యాక్సిన్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్రమోడీ ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించనున్నారు. కోవిడ్-19...

దేశ వ్యాప్తంగా రేపటి నుంచి కరోనా వ్యాక్సిన్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్రమోడీ ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించనున్నారు. కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రోగ్రామ్‌లో మొదటి రోజు సుమారు 3 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ షాట్లు ఇవ్వనున్నారు. భారతదేశంలోని 2934 వ్యాక్సిన్ కేంద్రాలలో రేపటి నుండి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది.

ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యతగా వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రేపటి నుంచి నిర్వహించనున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రతి కేంద్రంలో వందమందికి టీకాలు ఇచ్చే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీని భారత ప్రధాని నరేంద్ర మోడీ మరికొన్ని గంటల్లో ప్రారంభించనున్నారు. ఇప్పటికే పద మూడు ప్రాంతాలకు చేరిన కరోనా వ్యాక్సిన్‌ను ఒక క్రమపద్ధతిలో ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవ్వాల్సిన డోసుల కంటే అదనంగా 10% టీకా డోసులు ప్రతి కేంద్రంలో నిర్దేశించుకున్న టీకాల సంఖ్య కంటే ఎక్కువ కాకుండా ఉండే విధంగా చూసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు సూచించింది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ కేంద్రాల సంఖ్యను రాష్ట్రాలు పెంచుకుంటూ వెళ్లాలని, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నిర్దేశిత విధానంలో టీకాలు పంపిణీ కార్యక్రమం చేపట్టాలని పేర్కొంది.

దేశంలో అత్యవసర వినియోగం కింద కోవ్యాక్సిన్ ను , కోవిషీల్డ్ టీకాలను అందుబాటులోకి తీసుకొచ్చిన కేంద్రం ప్రస్తుతం ఏ టీకా తీసుకోవాలి అనే ఆప్షన్ లబ్ధిదారులకు ఉండదనే విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేసింది. తొలి దశలో భాగంగా కోటి మందికి టీకాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధం కాగా.. ఇప్పటికే వీటికి కావలసిన 1.65 కోట్లు డోస్‌లను ప్రభుత్వం సేకరించింది. వీటిలో 1.11 కోట్ల డోసులు కోవిషీల్డ్ టీకాలు కాగా, 55 లక్షల డోసులు భారత్ బయోటెక్‌కు చెందిన కోవ్యాక్సిన్ టీకాలను తీసుకుంది. ఆరోగ్య కార్యకర్తలకు టీకాల ఖర్చు భరించేది ప్రభుత్వమే మొదటి ఒక కోటి ఆరోగ్య కార్యకర్తలకు, రెండు కోట్ల మంది ఫ్రంట్లైన్ కార్యకర్తలకు, ఆపై 50 ఏళ్లు పైబడిన వ్యక్తులకు, ఆ తర్వాత 50 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న, ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి టీకాలు అందించబడతాయి. హెల్త్ కేర్ మరియు ఫ్రంట్లైన్ కార్మికులకు టీకాలు వేసే ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories