Corona Update in India: ఇండియాలో 10 లక్షలు దాటిన కరోనా యాక్టీవ్ కేసులు

India Covid 19 Active Cases Cross 10 Lakh Mark
x

Corona Update in India:(Photo BBC)

Highlights

Corona Update in India: ఇండియాలో కరోనా రోజురోజుకూ ఆల్ టైమ్ హై రికార్డులు బ్రేక్ చేసుకుంటోంది.

Corona Update in India: అందరం జాగ్రత్తలు తీసుకుంటున్నాకరోనా సెకండ్ వేవ్ మాత్రం సైలెంట్ గా దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఎవరూ నన్ను ఆపలేరు అన్నట్లు విరుచుకుపడుతోది. కరోనా. కరోనాకి వ్యాక్సిన్ వచ్చాక కూడా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయంటే... వ్యాక్సిన్లు పనిచేయట్లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఇండియాలో కరోనా రోజురోజుకూ ఆల్ టైమ్ హై రికార్డులు బ్రేక్ చేసుకుంటోంది. తాజాగా యాక్టివ్ కేసులు ఏకంగా 10 లక్షలు దాటేశాయి. 2 నెలల కిందటికీ ఇప్పటికీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ఇండియాలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 11,73,219 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..1,45,384 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజాగా 794 మరణాలు సంభవించాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,32,05,926 చేరగా.. 1,68,436 మంది ప్రాణాలు కోల్పోయారని శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక క్రియాశీల కేసులు భారీగా పెరిగాయి. నిన్నటికి 10,46,631మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో క్రియాశీల కేసుల వాటా 8 శాతానికి చేరువైంది. మరోవైపు రికవరీ రేటు 90.8శాతానికి పడిపోయింది. అయితే, నిన్న ఒక్కరోజే 77,567 మంది కోలుకోవడం సానుకూల పరిణామం. ప్రస్తుతం వైరస్‌ను జయించిన వారి సంఖ్య కోటీ 20లక్షలకు చేరువైంది.

మహారాష్ట్రలో తాజాగా 58,993 మందికి వైరస్ సోకగా..301 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దాంతో మొత్తం కేసుల సంఖ్య 32లక్షలకు పైబడగా..57వేల మందికిపైగా ప్రాణాలు వదిలారు. సుమారు 27లక్షల మంది కోలుకున్నారు. వైరస్‌తో బాధపడుతున్నవారి సంఖ్య 5,36,063 మందికి చేరింది. సగానికిపైగా క్రియాశీల కేసులు ఈ ఒక్కరాష్ట్రంలోనే నెలకొని ఉండటం తీవ్రతను వెల్లడిచేస్తోంది. మరోవైపు, దేశవ్యాప్తంగా నడుస్తోన్న కరోనా టీకా కార్యక్రమం కింద నిన్నటివరకు 9,80,75,160 మందికి టీకా డోసులు అందాయి. నిన్న ఒక్కరోజే 34,15,055 మందికి టీకా వేయించుకున్నారు.

తెలంగాణలో కొత్తగా 2,909 కొత్త కరోనా కేసులు వచ్చాయి. ఇప్పటివరకు 3,24,091 కేసులు నమోదయ్యాయి. కొత్తగా కరోనా నుంచి 584 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3,04,548కి చేరింది. కొత్తగా ఆరుగురు కన్నుమూశారు. మొత్తం మరణాల సంఖ్య 1752కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 17,791 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 11,495 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. GHMC పరిధిలో కొత్తగా 487 కేసులు వచ్చాయి. తెలంగాణలో కొత్తగా 1,11,726 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య కోటి 8లక్షల 73వేల 665కి చేరింది.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్తగా 31,892 టెస్టులు చెయ్యగా... 2,765 పాజిటివ్ కేసులు వచ్చాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 496, గుంటూరు జిల్లాలో 490, కృష్ణాజిల్లాలో 341, విశాఖపట్నం జిల్లాలో 335, నెల్లూరు జిల్లాలో 292 పాజిటివ్ కేసులు నమోదవగా.. అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 9,18,597కి చేరింది. కొత్తగా 11మంది మృతి చెందగా.., మొత్తం మరణాల సంఖ్య 7,279కి చేరింది. కొత్తగా 1,245 మంది డిశ్చార్జ్ అవగా మొత్తం రికవరీల సంఖ్య 8,94,896కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 16,422కి పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,53,65,743 శాంపిల్స్ టెస్ట్ చేశారు


Show Full Article
Print Article
Next Story
More Stories