Delhi: 27 ఏళ్లలో 5వేల కార్లు చోరీ...

Indias Biggest Car Thief Anil Chauhan Arrested By Delhi Police
x

Delhi: 27 ఏళ్లలో 5వేల కార్లు చోరీ...

Highlights

Delhi: దేశంలోనే అతిపెద్ద కార్ల దొంగను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

Delhi: ఢిల్లీలో ఓ గజ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. మన దేశంలోనే అతి పెద్ద కార్ల దొంగ అతడని పోలీసులు వెల్లడించారు. ఆ దొంగ 27 ఏళ్ల కాలంలో 5వేలకు పైగా కార్లను దొంగిలించాడు. వాటిని నేపాల్, జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు పంపేవాడు. ఆ తర్వాత అక్రమ ఆయుధ సరఫరా చేయడం ప్రారంభించాడు. ఆయనకు ముగ్గురు భార్యలు. ఏడుగురు పిల్లలకు తండ్రి.

1995లో ఢిల్లీలోని కాన్‌పూర్ ఏరియాలో ఉంటున్నప్పుడు అనిల్ చౌహాన్ ఆటో నడుపుతూ జీవించేవాడు. అప్పుడే కార్ల దొంగతనాలను ప్రారంభించాడు. ఆ కాలంలో మారుతి 800 కార్లు పెద్ద సంఖ్యలో దొంగిలించాడు. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో కారులను దొంగిలించి వాటిని నేపాల్, జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు పంపించేవాడు. ఈ కార్లను దొంగతనం చేసే సమయంలో కొంత మంది ట్యాక్సీ డ్రైవర్లను కూడా ఆయన హతమార్చినట్టు పోలీసులు తెలిపారు.

ఈ కార్ల దొంగ చివరకు అసోం వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అక్రమ మార్గాల్లో ఆర్జించిన దానితో ఢిల్లీ, ముంబయి, ఈశాన్య రాష్ట్రాల్లో ఆస్తులు పెంచుకున్నాడు. అనిల్ చౌహాన్ పై మనీ లాండరింగ్ కేసు కూడా దర్యాప్తు ఏజెన్సీ రిజిస్టర్ చేసింది. అనిల్ గతంలోనూ చాలా సార్లు అరెస్టు అయ్యాడు. 2015లో ఓ సారి కాంగ్రెస్ ఎమ్మెల్యేతో అరెస్టు అయ్యాడు. అప్పుడు ఆయన ఐదేళ్లు జైలులోనే గడిపాడు. 2020లో విడుదల అయ్యాడు. ఆయనపై 180 కేసులు ఉన్నాయి. అనిల్ చౌహాన్‌కు ముగ్గురు భార్యలు ఉన్నారు. ఏడుగురు పిల్లలను ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అసోంలోనూ ఆయన స్థానిక నేతలతో టచ్‌లో ఉన్నాడు. ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా మారాడు. పోలీసులు ఆయన నుంచి ఆరు పిస్టల్‌లు రికవరీ చేసుకున్నారు. ఏడు కార్ట్‌రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories